ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- February 28, 2026
మస్కట్: ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ మస్కట్‌లో ప్రారంభమైంది. వాణిజ్య, పరిశ్రమలు మరియు పెట్టుబడి ప్రమోషన్ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ హెచ్.ఇ. గాలిబ్ బిన్ సయీద్ అల్ మామారి ఆధ్వర్యంలో ఒమన్‌లోని బహ్రెయిన్ రాయబార కార్యాలయం ఒమన్-బహ్రెయిన్ ఫ్రెండ్‌షిప్ అసోసియేషన్ సహకారంతో ఈ ఎగ్జిబిషన్ ను నిర్వహిస్తుంది.
ఈ కార్యక్రమం రెండు దేశాల ప్రజల మధ్య దీర్ఘకాల చారిత్రక సంబంధాలను ప్రతిబింబిస్తుందన్నారు. వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచడానికి మరియు ఆర్థిక సమైక్యత వైపు కదలాలని పిలుపునిచ్చారు. ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల మధ్య ప్రత్యక్ష మార్కెటింగ్ మార్గాలను పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఒమన్‌లోని బహ్రెయిన్ రాయబారి డాక్టర్ జుమా బిన్ అహ్మద్ అల్ కాబి మాట్లాడుతూ.. ఈ ప్రదర్శన SMEలకు మద్దతు ఇవ్వడంలో మరియు జాతీయ ఆర్థిక వ్యవస్థకు వారి సహకారాన్ని పెంచడంలో బహ్రెయిన్ నిబద్ధతను ప్రతిబింబిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒమన్ నుండి 20 మంది మరియు బహ్రెయిన్ నుండి 10 మందితో సహా దాదాపు 30 మంది ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. ప్రారంభోత్సవంలో బహ్రెయిన్ రాయబారి, పలువురు ఉన్నతోద్యుగులు, అనేక మంది అధికారులు, కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రియాద్‌లో రాజమండ్రి దంపతుల హత్య
- అమెరికాలో AI ప్రకంపనలు..
- మార్చి 1 నుండి మారనున్న నిబంధనలు ఇవే..
- పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఆప్టామిల్, బెబెలాక్ ఇన్ఫాంట్ ఫార్ములా పై SFDA హెచ్చరిక..!!
- ముహారక్ సౌక్ భవిష్యత్ పై కౌన్సిల్ సమీక్ష..!!
- కువైట్ జాతీయ దినోత్సవం..అద్భుతమైన వైమానిక ప్రదర్శన..!!
- విజిట్ ఖతార్..అల్ రువైస్ మారిటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్..!!









