మార్చి 1 నుండి మారనున్న నిబంధనలు ఇవే..
- February 28, 2026
ప్రతి నెలా మొదటి తారీఖున కొన్ని ప్రభుత్వ మరియు ఆర్థిక నిబంధనలు మారడం సహజం. అయితే, ఈ ఏడాది మార్చి 1 నుండి దేశవ్యాప్తంగా సామాన్యుల జీవితాల పై ప్రభావం చూపే అనేక కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. గ్యాస్ ధరల నుండి మొబైల్ సిమ్ నిబంధనల వరకు మారనున్న ఆ ప్రధాన అంశాలు ఇవే:
ప్రతి నెలా ఒకటో తేదీన చమురు మార్కెటింగ్ సంస్థలు ఇంధన ధరలను సమీక్షిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా మార్చి 1 నుండి LPG (వంటగ్యాస్ సిలిండర్) ధరలతో పాటు వాహనాలకు వాడే CNG, గృహ అవసరాల PNG మరియు విమాన ఇంధనం (ATF) ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇది సామాన్యుల బడ్జెట్ పై నేరుగా ప్రభావం చూపుతుంది.
భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పాత UTS (Unreserved Ticketing System) యాప్‌ను నిలిపివేసి, దాని స్థానంలో మరింత మెరుగైన ఫీచర్లతో కూడిన ‘RailOne’ అనే కొత్త యాప్‌ను మార్చి 1 నుండి ప్రవేశపెట్టనుంది. ప్రయాణికులు ఇకపై తమ జనరల్ టికెట్లను ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
సైబర్ నేరాలు మరియు ఫ్రాడ్ మెసేజ్‌లను అరికట్టేందుకు టెలికాం శాఖ కఠిన నిబంధనలను తీసుకువస్తోంది. దీని ప్రకారం మార్చి 1 నుండి ‘సిమ్-బైండింగ్’ (SIM-binding) ప్రక్రియ తప్పనిసరి అవుతుంది. అంటే, మీరు ఉపయోగించే ప్రతి మెసేజింగ్ యాప్ (ఉదాహరణకు WhatsApp లేదా ఇతర యాప్స్) ఖాతాను మీ ఫోన్లోని యాక్టివ్ సిమ్ కార్డుతో అనుసంధానం చేయాలి. దీనివల్ల నకిలీ ఖాతాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







