రియాద్‌లో రాజమండ్రి దంపతుల హత్య
- February 28, 2026
సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో మనసును కలిచివేసే విషాదం చోటుచేసుకుంది. ఆన్లైన్ గేమ్‌లకు బానిసైన ఓ విద్యార్థి విచక్షణ కోల్పోయి కన్న తల్లిదండ్రులనే అత్యంత కిరాతకంగా హతమార్చాడు.ఆ పై తాను కూడా భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన రియాద్‌లోని తెలుగు ప్రవాసీ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆన్లైన్ గేమింగ్ ఎంతటి ప్రమాదకరంగా మారుతుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గాలి రవి (49), శ్రీదేవి (43) దంపతులు గత కొంతకాలంగా రియాద్‌లోని హరా ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరి కుమారుడు యెజ్ర ప్రభాకర్ స్థానిక భారతీయ పాఠశాలలో ప్లస్ 2 చదువుతున్నాడు. అయితే ప్రభాకర్ ఆన్లైన్ గేమ్‌లకు తీవ్రంగా బానిసయ్యాడు. చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని తల్లిదండ్రులు తరచూ మందలించేవారు.
గురువారం రాత్రి ఇదే విషయమై మరోసారి మందలించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ప్రభాకర్, విచక్షణ కోల్పోయి తల్లిదండ్రులను కత్తితో పొడిచి చంపేశాడు.అనంతరం ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసి తిన్నాడు. కొంతసేపటికి తాను నివసిస్తున్న భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రవి ఓ బ్యాంకులో, శ్రీదేవి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తూ అందరితో స్నేహంగా ఉండేవారని స్థానిక ప్రవాసీయులు గుర్తు చేసుకున్నారు. కన్నకొడుకు చేతిలోనే ఇంత దారుణంగా చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని కన్నీటిపర్యంతమయ్యారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







