పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- February 28, 2026
యూఏఈ: దుబాయ్‌లో పెయిడ్ పబ్లిక్ పార్కింగ్ సేవలను అందించే అతిపెద్ద ప్రొవైడర్ అయిన పార్కిన్ కంపెనీ దుబాయ్ లో ఫీజులను పెంచనుందన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆర్టీఏతో కుదుర్చుకున్న కన్సెషన్ ఒప్పందానికి అనుగుణంగా, నగరంలో పార్కింగ్ టారిఫ్‌లను పెంచడానికి దరఖాస్తును సమర్పించినట్లు పార్కిన్ లోని ఒక సీనియర్ అధికారి చెప్పడం ఫీజుల పెంపునకు సంబంధించి ఊహాగానాలకు తెరలేపింది.
"RTAతో మా కన్సెషన్ ఒప్పందం ప్రకారం, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి టారిఫ్ సర్దుబాటును అభ్యర్థించాల్సిన బాధ్యత మాకు ఉంది. ఒప్పందం ప్రకారం ఫిబ్రవరి నెలకు రెండేళ్లు పూర్తవుతుంది. కన్సెషన్ ఒప్పందం ప్రకారం పని చేస్తున్నాము. ధరలను పెంచడం లేదా గోప్యంగా పెట్టడం దీని ఉద్దేశ్యం కాదు," అని పార్కిన్ CEO ఇంజినీర్ మొహమ్మద్ అబ్దుల్లా అల్ అలీ స్పష్టం చేశారు.అయితే, అధికారుల ఆమోదానికి లోబడి రేట్లు పెరుగుతాయని ఇప్పుడే చెప్పలేమని ఆయన అన్నారు.తాము పారదర్శకంగా ఉన్నామమని, తాము కొత్త రేట్లను నిర్ణయిస్తే తమ కస్టమర్‌లకు సమాచారం అందిస్తామని పేర్కొన్నారు.
గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 2025 మూడవ త్రైమాసికంలో దుబాయ్‌లో పెయిడ్ పార్కింగ్ సగటు గంట ఖర్చు 51 శాతం పెరిగింది. జూలై-సెప్టెంబర్ 2025లో వెయిటెడ్ సగటు గంట టారిఫ్ Dh2.01 నుంచి Dh3.03కి పెరిగింది.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







