‘శ్రీనివాస మంగపురం’ నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్
- February 28, 2026
‘శ్రీనివాస మంగపురం’ నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్
కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు మరోసారి వెండితెరపై తన గంభీరమైన నటనతో అలరించబోతున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘శ్రీనివాస మంగపురం’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా చిత్రబృందం ఈ సినిమా నుంచి మోహన్ బాబు పోషిస్తున్న పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్ చూస్తుంటే మోహన్ బాబు తనదైన శైలిలో పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను మెప్పించబోతున్నారని స్పష్టమవుతోంది.
ఈ చిత్రంలో మోహన్ బాబు “వెంకటప్పయ్య నాయుడు” అనే పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన పోస్టర్‌లో ఆయన లుక్ ఎంతో రాజసంగా, గంభీరంగా ఉంది. కళ్ళలో గర్వం, ముఖంలో ధైర్యం కలగలిసిన ఒక విలక్షణమైన వ్యక్తిత్వమున్న పాత్రలో ఆయన కనిపించబోతున్నారని చిత్ర యూనిట్ పేర్కొంది. ‘మహాసముద్రం’, ‘మంగళవారం’ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న దర్శకుడు అజయ్ భూపతి, మోహన్ బాబును ఒక సరికొత్త కోణంలో చూపించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ చిత్రంతో సూపర్ స్టార్ కృష్ణ మనవడు, రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని వెండితెరకి పరిచయం కాబోతుండగా.. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాశా థడాని హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రముఖ నిర్మాతలు అశ్వినీదత్, జెమిని కిరణ్ ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







