ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా మిసైళ్ల వర్షం
- February 28, 2026
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ భీకరయుద్దం మొదలయ్యింది. ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా బలగాలు ఇరాన్‌పై మిసైళ్ల వర్షం కురిపించాయి. కౌంటర్‌గా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై దాడులు ప్రారంభించింది. 70 ఖండాంతర క్షిపణులను ఇరాన్ ప్రయోగించింది. ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్లను కూల్చేస్తునట్టు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. . ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో భారీ పేలుళ్లు జరిగాయి. 30 ప్రాంతాల్లో మిసైల్ దాడులు చేపట్టింది ఇజ్రాయెల్ . – ఉత్తర టెహ్రాన్‌లో బాంబుల మోతతో దద్దరిల్లింది. ఖమేనీ కార్యాలయాలే టార్గెట్‌గా ఇజ్రాయెల్ అటాక్ చేసింది. ఇజ్రాయెల్ ప్రభుత్వం ఈ దాడులకు సింహగర్జన అని పేరు పెట్టింది.
ఇజ్రాయెల్-అమెరికా దాడుల తరువాత ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సురక్షిత ప్రాంతానికి తరలించారు. బంకర్ లోకి ఆయన వెళ్లిపోయారు. — ఇరాన్ డిఫెన్స్ సిస్టంపైనా ఇజ్రాయెల్ దాడులు చేసినట్లు తెలుస్తోంది. డిఫెన్స్ సిస్టమ్‌కు భారీ నష్టం వాటిల్లినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. ఇరాన్‌కు పదే పదే హెచ్చరికలు జారీచేస్తూ వచ్చాయి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు. ఈ దాడుల తరువాత ఇరాన్ తన ఎయిర్‌స్పేస్‌ను మూసేసింది.
ఇరాన్ అణ్వాయుధాలను అంతం చేసే వరకు దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ సెన్యం వెంటనే లొంగిపోవాలని హెచ్చరించారు. టెర్రరిస్టులకు ఆశ్రయం ఇస్తున్న నెంబర్‌వన్ దేశంగా ఇరాన్ మారిందన్నారు. ఇజ్రాయెల్, అమెరికా దాడులపై ఇరాన్ స్పందించింది. యుద్దం మీరు మొదలుపెట్టారు. ముగింపు మేము పలుకుతాం అంటూ స్టేట్‌మెంట్ విడుదల చేసింది.
ఇరాన్‌పై దాడుల తర్వాత ఇజ్రాయెల్ అప్రమత్తం అయింది. స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీని ప్రకటించింది. దేశవ్యాప్తంగా సైరన్లు మోగుతున్నాయ్. దేశ పౌరులను అప్రమత్తం చేసింది ఇజ్రాయెల్ సైన్యం దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేసింది. ఇజ్రాయెల్‌లో స్కూళ్లు, కార్యాలయాలు మూసివేశారు. అంతేకాదు ఇజ్రాయెల్‌లోని ఇండియన్ ఎంబసీ కూడా అడ్వైజరీ జారీ చేసింది. భారతీయులు ఎక్కడ ఉన్నా సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని చెప్పింది. అత్యవసరం అయితే తప్ప.. బయటకు రావొద్దని హెచ్చరించింది భారత ఎంబసీ.
తాజా వార్తలు
- దుబాయ్ కస్టమ్స్ అప్రమత్తత.. బ్యాగ్ ఫ్రేమ్‌లో దాచిన 460 గ్రాముల బంగారం స్వాధీనం
- వారణాసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం..
- సైబర్ నేరాల నియంత్రణలో దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రథమ స్థానం
- ఏపీ కేబినెట్లో 34 కీలక అంశాలకు ఆమోదం..
- ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు రూ.557కోట్లు !!
- హైదరాబాద్‌లో నో టాలరెన్స్ జోన్ల ఏర్పాటు
- దుబాయ్ కస్టమ్స్ కీలక నిర్ణయం..Dh1,000 వరకు దిగుమతి వస్తువులకు కస్టమ్స్ సుంకం మినహాయింపు
- ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన డీజీపీ సి.వి.ఆనంద్
- భారత కాన్సుల్ జనరల్‌ను కలిసిన ఆస్టర్ చైర్మన్ డాక్టర్ ఆజాద్ మూఫెన్
- ఖతార్‌లో ప్రయాణికుల మెడిసిన్స్ కు ఈ-పర్మిట్..!!







