ఇజ్రాయెల్‌లో భారతీయులకు హై అలర్ట్
- February 28, 2026
ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడులతో పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదిరింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న వేలాది మంది భారతీయులు, అప్రమత్తంగా ఉండాలని టెల్ అవీవ్‌లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెచ్చరిక జారీ చేసింది.భద్రతా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నామని, భారత పౌరులకు అవసరమైన సహాయం అందించేందుకు స్థానిక అధికారులతో టచ్‌లో ఉన్నామని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.
ప్రధాన సూచనలు..
ఇజ్రాయెల్ అధికారులు, ‘హోమ్ ఫ్రంట్ కమాండ్’ జారీ చేసే భద్రతా సూచనలను ఎప్పటికప్పుడు గమనిస్తూ, తప్పనిసరిగా పాటించాలి.
నివాస ప్రాంతాల్లో లేదా కార్యాలయాల వద్ద ఉన్న రక్షణ కేంద్రాలు, సురక్షిత గదుల గురించి ముందే తెలుసుకోవాలి. అత్యవసర సమయంలో వెంటనే అక్కడికి చేరుకునేందుకు సిద్ధంగా ఉండాలి.
ఇజ్రాయెల్ దేశం లోపల అత్యవసరం కాని ప్రయాణాలను ప్రస్తుతానికి పూర్తిగా వాయిదా వేసుకోవాలి.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







