వాషింగ్టన్‌లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!

- February 28, 2026 , by Maagulf
వాషింగ్టన్‌లో అమెరికా ఉపాధ్యక్షుడితో సయ్యద్ బదర్ భేటీ..!!

వాషింగ్టన్: వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్‌తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బదర్ బిన్ హమద్ అల్ బుసైది సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఒమన్-అమెరికన్ సంబంధాలపై సమీక్షించారు.  రెండు దేశాల మద్య స్నేహ సంబంధాలను మరియు చారిత్రాత్మక, వ్యూహాత్మక బంధాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. రాబయో రోజుల్లో విభిన్న డొమైన్‌లలో కలిసి పనిచేయాలని నిర్ణయించారు. 

అనంతరం ఇరాన్ అణుశక్తి కార్యక్రమం యొక్క శాంతియుత పరిష్కారానికి సంబంధించిన విషయాలపై కీలకంగా చర్చించారు. జరుగుతున్న దౌత్య పరమైన ప్రయత్నాలతో పాటు, ఒమన్ ఆధ్వర్యంలో అమెరికా-ఇరాన్ చర్చలను ఇరువురు సమీక్షించారు. చర్చల్లో నిర్మాణాత్మక ఆలోచనలు మరియు ప్రతిపాదనలపై తమ అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. విభేదాలను తగ్గించడానికి మరియు గౌరవప్రదమైన ఒప్పందాన్ని సాధించడానికి తీసుకోవల్సిన అంశాలపై సమీక్షించారని ఒక ప్రకటనలో తెలియజేశారు.   ఈ సమావేశంలో అమెరికా, ఒమన్ కు చెందని మంత్రులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com