ఇరాన్‌ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు

- February 28, 2026 , by Maagulf
ఇరాన్‌ పై దాడుల ఎఫెక్ట్..ఎయిర్ ఇండియా విమానాల రద్దు

మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.మిడిల్ ఈస్ట్ లోని అన్ని గమ్యస్థానాలకు తమ విమాన సర్వీసులను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.ఇరాన్‌ పై అమెరికా, ఇజ్రాయెల్ భారీ సైనిక చర్యలు ప్రారంభించడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇవాళ‌ ఇరాన్‌ పై సమన్వయంతో దాడులు ప్రారంభించాయి.ఈ పరిణామంతో మిడిల్ ఈస్ట్ లో ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణ మరింత విస్తరిస్తే సుదూర భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా ముందు జాగ్రత్త చర్యగా విమానాలను రద్దు చేసింది.

“మిడిల్ ఈస్ట్ లోని కొన్ని ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మా ప్రయాణికులు, సిబ్బంది భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం.అందుకే అన్ని విమానాలను నిలిపివేస్తున్నాం. భద్రతా వాతావరణాన్ని నిరంతరం అంచనా వేస్తూ, అవసరమైన మేరకు మా ఆపరేషన్లను సర్దుబాటు చేస్తాం” అని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభావితమైన ప్రయాణికులకు తమ బృందాలు అన్ని విధాలా సహకరిస్తాయని హామీ ఇచ్చింది.ఎయిర్ ఇండియాతో పాటు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కూడా తన సర్వీసుల పై కీలక ప్రకటన చేసింది. గల్ఫ్ రీజియన్‌లోని పరిస్థితుల దృష్ట్యా పశ్చిమ దేశాలకు వెళ్లే అన్ని అంతర్జాతీయ విమానాలను రద్దు చేసినట్లు సంస్థ ప్రతినిధి తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com