ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!

- February 28, 2026 , by Maagulf
ఇరాన్ తో యుద్ధం.. USకు మద్దతిస్తున్న దేశాలివే!

మిడిల్ ఈస్ట్‌లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో, అమెరికాకు మద్దతుగా పలు దేశాలు నిలుస్తున్నాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతానికి చెందిన సౌదీ అరేబియా,యూఏఈ, కువైట్, ఖతర్, బహ్రెయిన్ మరియు జోర్డాన్ దేశాలు తమ భూభాగంలో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను రక్షించుకుంటూ, అమెరికాకు తమ మద్దతును తెల్పుతున్నాయి. ఈ దేశాలు ఉద్రిక్తతలను తగ్గించాలని కోరుతున్నప్పటికీ, అమెరికా భద్రతా చర్యలకు లోపాయికారీగా సహకరిస్తున్నాయి. అలాగే, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ వంటి పాశ్చాత్య దేశాలు ఇరాన్ యొక్క న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను తీవ్రంగా ఖండిస్తూ అమెరికా వైపు నిలబడ్డాయి. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్ కూడా అమెరికా చర్యలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.

ఈ సంక్లిష్టమైన అంతర్జాతీయ పరిణామాల మధ్య, భారతదేశం తన నిశ్శబ్ద వైఖరిని కొనసాగిస్తోంది. ఇరు దేశాలకు మద్దతు ఇచ్చే విషయంలో భారత్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇరాన్ మరియు ఇజ్రాయెల్ రెండింటితోనూ భారత్‌కు బలమైన దౌత్య మరియు ఆర్థిక సంబంధాలు ఉండటమే దీనికి ప్రధాన కారణం. ఉద్రిక్తతలు పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతుందని భారత్ ఆందోళన చెందుతోంది. కాబట్టి, భారత్ దౌత్యపరమైన పరిష్కారాన్ని కోరుతూ, పౌరుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com