సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- March 01, 2026
భారత దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మార్చి 1, 2026 నుంచి “సిమ్ బైండింగ్” (SIM Binding) విధానాన్ని అమలు చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ నిబంధన WhatsApp, Telegram, Signal, Snapchat, ShareChat వంటి మెసేజింగ్ యాప్‌లకు వర్తించవచ్చని చెబుతున్నారు.
ఇప్పటి వరకు ఒకసారి ఫోన్ నంబర్‌తో వాట్సాప్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత, ఆ సిమ్ కార్డు ఫోన్లో లేకపోయినా యాప్ ఉపయోగించగలిగేవారు. కానీ కొత్త విధానం అమల్లోకి వస్తే, మీరు ఏ నంబర్‌తో ఖాతా తెరిచారో, ఆ యాక్టివ్ సిమ్ అదే ఫోన్లో ఉండాల్సి ఉంటుంది. సిమ్ లేకపోతే యాప్ పనిచేయదు.
కొత్త నియమాల వల్ల మార్పులు
యాప్ వినియోగం
ఫోన్లో సిమ్ కార్డు తీసేస్తే వెంటనే యాప్ సేవలు నిలిచిపోతాయి. దీంతో హ్యాకర్లు మీ నంబర్‌ను ఇతర పరికరాల్లో దుర్వినియోగం చేయడం కష్టమవుతుంది.
వెబ్ & డెస్క్‌టాప్ వినియోగం
వాట్సాప్ వెబ్ లేదా డెస్క్‌టాప్ ఉపయోగిస్తున్నప్పుడు భద్రతా కారణాల వల్ల ప్రతి 6 గంటలకు ఆటోమేటిక్ లాగ్ అవుట్ కావచ్చు. మళ్లీ QR కోడ్ స్కాన్ చేసి లాగిన్ కావాల్సి ఉంటుంది.
సైబర్ భద్రత మెరుగుదల
ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం, ఈ విధానం ద్వారా సైబర్ నేరాలను గుర్తించడం మరియు నియంత్రించడం సులభమవుతుంది. వినియోగదారుల భద్రత కోసం తీసుకున్న చర్యల్లో ఎటువంటి సడలింపులు ఉండవని అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లోని ఇండస్ట్రియల్ ఏరాలో అగ్నిప్రమాదం..!!
- ప్రయాణికులు ఎమిరేట్స్ కీలక సూచనలు..!!
- బ్రేకింగ్: గల్ఫ్ దేశాల్లో రేపటి CBSE పరీక్షలు వాయిదా!
- మిడిల్ ఈస్ట్ లో యుద్ధ ఉధృతి: విమాన ప్రయాణికులకు ముఖ్య గమనిక
- ఇవాళ్టి నుంచి బస్సుల్లో దివ్యాంగులకు ఫ్రీ జర్నీ
- దుబాయ్ లో అడ్డగించిన డ్రోన్ల అవశేషాలు ఇళ్ల ఆవరణల్లో పడి ఇద్దరు గాయాలు
- ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- ఏపీ నూతన సీఎస్‌గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం









