ఏపీ నూతన సీఎస్‌గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- March 01, 2026
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా జి.సాయిప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని ఆయన కార్యాలయంలో టీటీడీ, విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధి వేద పండితులు ఆశీర్వచనాలు అందించారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలను నిర్వహించారు. అనంతరం ఆయన పదవీ బాధ్యతలను చేపట్టారు. ఇప్పటివరకు సీఎస్‌గా విధులు నిర్వహించిన విజయానంద్ అదే రోజు ఉదయం పదవీ విరమణ చేశారు. ఆయన స్థానంలో సాయి ప్రసాద్ నియమితులు అయ్యారు.
కొత్త ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్‌కి సచివాలయంలోని ఉన్నతాధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు శుభాకాంక్షలను వెల్లడించారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్‌ఎస్ రావత్, ఎంటీ కృష్ణ బాబు, ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, ముఖ్య కార్యదర్శులుకాంతిలాల్ దండే, ముఖేశ్ కుమార్ మీనా తదితరులు విషెస్ అందించారు. సచివాలయ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కూడా మర్యాద పూర్వకంగా కలిసి అభినందలు చెప్పారు. అలాగే 20 సూత్రాల అమలు కమిటీ ఛైర్మన్ లంకా దినకర్ సహా పలు కార్పొరేషన్ ఛైర్మన్లు కొత్త సీఎస్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పారు.
తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







