'మార్లిన్‌' అనే సరికొత్త పరికరం

- July 31, 2016 , by Maagulf
'మార్లిన్‌' అనే సరికొత్త పరికరం

వ్యాయామంతో పాటు ఈత కొట్టడం సాధారణమైంది. అయితే.. నీటిలో ఎంత వేగంగా దూసుకెళ్తున్నాం? కాళ్లు.. చేతులు ఎంత వేగంగా ఆడిస్తున్నాం? అన్న విషయాలు తెలుసుకోవడం అవసరం. ఇందుకోసం చాలామంది స్పోర్ట్స్‌ వాచీలను.. ట్రాకర్లను వాడుతుంటారు. కానీ.. నీటిలో వాచీని చూడాలంటే ఈదటం ఆపాల్సి ఉంటుంది. ఆ సమస్యకు చెక్‌పెట్టేందుకు వీలుగా 'మార్లిన్‌' అనే సరికొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది.
హెడ్‌సెట్‌లా ఉండే ఈ పరికరాన్ని హాంకాంగ్‌కు చెందిన ప్లేటీసెన్స్‌ అనే సంస్థ అభివృద్ధి చేసింది. దీన్ని హెడ్‌సెట్‌లాగే తలకు తగిలించుకుంటే.. ఈత కొడుతున్నప్పుడు మన కదలికలను మోషన్‌ సెన్సర్ల ద్వారా గమనిస్తూ.. ఎప్పటికప్పుడు మాటల్లో చెప్పేస్తుంది. చేతుల్ని.. కాళ్లను ఎంత వేగంగా ఆడిస్తున్నామో.. ఎంతసేపు విరామం లేకుండా ఈదుతున్నామన్న వివరాలను మాటల ద్వారా చెవుల్లో చెబుతుంది. స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా చేరుకోవాల్సిన స్థానాన్ని సెట్‌ చేస్తే.. నీళ్లలో గమ్యాన్ని చేరుకునేందుకు ఎటు తిరగాలో లెఫ్ట్‌, రైట్‌ అని సూచనలు కూడా ఇస్తుంది.
ఇందులోని బ్యాటరీని ఒక్కసారి నింపితే దాదాపు 10గంటల పాటు పనిచేస్తుందట. జీపీఎస్‌ వాడితే ఐదు గంటలపాటు వస్తుందట.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com