మాతృభాషలో ఈ-మెయిల్ ఐడీ క్రియేట్,,,
- July 31, 2016
మాతృభాషలో ఈ-మెయిల్ ఐడీ క్రియేట్ చేసుకోవడం మీ కోరికనా..? అయితే నచ్చిన భాషలోనే ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకునే అవకాశం యూజర్ల ముందుకు రాబోతుందట. అమెరికన్ టెక్నాలజీ దిగ్గజాలు గూగుల్, మైక్రోసాప్ట్ లు, రీడిఫ్ లాంటి దేశీయ ఈ-మెయిల్ సంస్థలు నచ్చిన భాషలో ఈమెయిల్ క్రియేట్ చేసుకునే వెసులుబాటును కల్పించనున్నాయట. ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ-మెయిల్ సర్వీసు ప్రొవేడర్లు ఈ మేరకు సేవలు అందించేందుకు సమ్మతించారు. గూగుల్, మైక్రోసాప్ట్, రీడిఫ్ మెయిల్ ఎగ్జిక్యూటివ్ లతో ప్రభుత్వం గత నెలలో సమావేశం జరిపింది. ఈ సమావేశంలో దేశీ ఈ-మెయిల్ అడ్రస్ లను యూజర్లకు అందుబాటులోకి తేవాలని, హిందీ లాంగ్వేజ్ తో ఈ సర్వీసులను అందించాలని ప్రభుత్వం కోరింది. దీంతో సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇంటర్నెట్ యాక్సెస్ ను మరింత దగ్గర చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే కొన్నేళ్లలో భారత్ నెట్ ప్రాజెక్టు కింద 250,000 గ్రామ పంచాయితీలను హైస్పీడ్ ఇంటెర్నెట్ కు కనెక్ట్ చేయనున్నామని ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ రాజీవ్ బన్సాల్ తెలిపారు. వారికి అనువైన రీతిలో ఇంటర్నెట్ సేవలు కల్పిస్తే ప్రజలు సులభతరంగా దీన్ని యాక్సెస్ పొందుతారని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నెట్ యాక్సెస్ ను కూడా పెంచవచ్చని తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







