దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్‌లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- March 02, 2026
దుబాయ్: దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సోమవారం ప్రకటించిన ప్రకటన ప్రకారం, మార్చి 2, 2026 సోమవారం సాయంత్రం నుంచి పరిమిత స్థాయిలో విమాన కార్యకలాపాలు పునఃప్రారంభం కానున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DXB) మరియు దుబాయ్ వరల్డ్ సెంట్రల్ – అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (DWC) నుంచి కొద్ది సంఖ్యలో విమానాలకు అనుమతి ఇవ్వబడనుంది.
దుబాయ్ ప్రభుత్వ మీడియా కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం, తమ ఎయిర్‌లైన్ నుంచి నిర్ధారిత బయలుదేరే సమయం గురించి నేరుగా సమాచారం అందుకున్న ప్రయాణికులు మాత్రమే విమానాశ్రయాలకు రావాలని అధికారాలు సూచించాయి. ఎయిర్‌లైన్ నుంచి సమాచారం రాకుండా విమానాశ్రయాలకు రావద్దని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, ఎమిరేట్స్ ఎయిర్‌లైన్ కూడా సోమవారం సాయంత్రం నుంచి పరిమిత సంఖ్యలో విమానాలను ప్రారంభించనున్నట్లు ధృవీకరించింది. “ముందుగా బుకింగ్ చేసిన ప్రయాణికులకు ప్రాధాన్యత ఇస్తున్నాము. ఈ పరిమిత విమానాలకు మళ్లీ బుక్ చేయబడిన ప్రయాణికులను ఎమిరేట్స్ నేరుగా సంప్రదిస్తుంది” అని సంస్థ తెలిపింది.
అయితే, మిగిలిన అన్ని విమానాలు తదుపరి ప్రకటన వచ్చే వరకు నిలిపివేయబడ్డాయని ఎయిర్‌లైన్ స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా
- ఏపీ రాజధాని కోసం మరో 14.36 ఎకరాలు..
- మెడికల్ విద్యార్థినికి రూ.2 లక్షలు సాయం చేసిన కేటీఆర్
- భారత్-యూఏఈ వాణిజ్య, పెట్టుబడి సంబంధాల బలోపేతం పై చర్చలు
- అక్టోబర్ 8న దుబాయ్ మిరాకిల్ గార్డెన్ సీజన్-15 ప్రారంభం.. టికెట్ ధరలు ఇవే
- ఇరాన్ విమానయాన రంగం పై అమెరికా మరింత ఆంక్షల హెచ్చరిక
- షేక్ అహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మృతికి ప్రెసిడెన్షియల్ కోర్టు సంతాపం
- ఇతరుల ఐడీలతో సిమ్ వాడుతున్నారా? కేంద్రం DoT హెచ్చరికలు ఇవే!







