ఒమన్‌లో కొత్త పర్యాటక ప్రాజెక్టు ‘అల్ యజాన్’..!!
- November 09, 2026
మస్కట్: ఒమన్ రాజధాని మస్కట్‌లోని ముత్రా ప్రాంతంలో సుల్తాన్ ఖాబూస్ పోర్టు సమీపంలో భారీ సమీకృత పర్యాటక ప్రాజెక్టు ‘అల్ యజాన్’ (Al Yazan) రూపుదిద్దుకోనుంది. మస్కట్ గవర్నర్, రాష్ట్ర మంత్రి హిస్ హైనెస్ సయ్యద్ బిలారబ్ బిన్ హైతమ్ అల్ సయీద్ ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు.
ఒమన్ టూరిజం డెవలప్‌మెంట్ కంపెనీ (OMRAN Group), VA Group పర్యవేక్షణలో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నారు. మొత్తం 18.5 హెక్టార్ల విస్తీర్ణంలో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో సుమారు 1,500 నివాస యూనిట్లు ఏర్పాటు చేయనున్నారు. ప్రాజెక్టు రూపకల్పనను పరిశీలించిన సయ్యద్ బిలారబ్‌కు అధికారులు వివరాలు వెల్లడించారు. ముత్రా ప్రాంతంలోని పర్వతాలు, సముద్ర తీర ప్రాంతాల సహజ అందాలు, సంప్రదాయ నిర్మాణ శైలిని ప్రతిబింబించేలా దీనిని రూపొందించారు. స్థానిక ప్రాంత ప్రత్యేకతలకు అనుగుణంగా భవనాల నిర్మాణం చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టులో 1,80,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నివాస సముదాయాలు ఉంటాయి. మూడు దశల్లో నిర్మాణం చేపట్టనున్నారు. పర్వత ప్రాంతాల నుంచి సముద్ర తీరం వైపు వివిధ ఎత్తుల్లో భవనాలను వరుసగా నిర్మించడంతో పాటు పచ్చదనానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నివాస సముదాయాలతో పాటు ప్రజలు, పర్యాటకుల కోసం అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నారు. సముద్ర తీరంలో 400 మీటర్లకు పైగా పొడవైన వాకింగ్ ప్రొమెనేడ్ నిర్మించనున్నారు. దుకాణాలు, రెస్టారెంట్లు, కేఫ్‌లతో కూడిన ప్రత్యేక
అలాగే 30,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పచ్చని పార్కులు, బహిరంగ ప్రదేశాలు ఏర్పాటు చేయనున్నారు. అర్ధచంద్రాకారంలో ప్రత్యేక ప్లాజా, బహిరంగ రంగస్థలం, ప్రీమియం రెస్టారెంట్లు, బహుళ ప్రయోజన క్రీడా కోర్టులు, పిల్లల ఆట స్థలాలు కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ఉంటాయి. నివాసితులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించడంతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ‘అల్ యజాన్’ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో కొత్త పర్యాటక ప్రాజెక్టు ‘అల్ యజాన్’..!!
- సౌదీ–అమెరికా మధ్య వాణిజ్యం పెంపునకు కొత్త ప్రణాళికలు..!!
- ఖతార్‌లో ఘనంగా ప్రారంభమైన MWC26 దోహా..!!
- అరబ్ దేశాల ఐక్యత మరింత బలోపేతం కావాలి: హమద్
- కువైట్‌లో 13 మంది ఆసియా దేశస్థుల అరెస్ట్..!!
- యూఏఈ పాఠశాలల్లో కఠినమైన సైబర్ భద్రతా నిబంధనలు..!!
- దీపావళి వేళ ఘోర అగ్నిప్రమాదాలు.. మూడు ఘటనల్లో 18 మంది సజీవదహనం!
- వాహనదారులకు తెలంగాణ RTA గుడ్ న్యూస్
- టపాసులతో 48 మందికి కంటికి గాయాలు!
- ఖతార్‌లో కొత్తగా మరో రెండు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు..!!







