రియాద్‌లో ‘వైమానిక ముప్పు’ హెచ్చరిక.. నిమిషాల వ్యవధిలోనే ఉపసంహరణ

- November 09, 2026 , by Maagulf
రియాద్‌లో ‘వైమానిక ముప్పు’ హెచ్చరిక.. నిమిషాల వ్యవధిలోనే ఉపసంహరణ

రియాద్: సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో ‘శత్రు వైమానిక ముప్పు’ పొంచి ఉందంటూ అధికారులు ప్రజలకు అత్యవసర హెచ్చరిక సందేశం పంపించారు. అయితే కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఈ హెచ్చరికను ఉపసంహరించుకున్నారు.

రియాద్‌లో నివసిస్తున్న ప్రజల మొబైల్ ఫోన్లకు సౌదీ అధికారులు టెక్స్ట్ అలర్ట్ పంపించారు. అందులో.. “హెచ్చరిక.. ఈ ప్రాంతంలో శత్రు వైమానిక ముప్పు ఉంది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. ఇళ్లలోనే లేదా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. కిటికీలు, తలుపులకు దూరంగా ఉండాలి. పౌర రక్షణ శాఖ (Civil Defence) సూచనలను తప్పనిసరిగా పాటించాలి” అని పేర్కొన్నారు.

అయితే ఈ హెచ్చరిక జారీ చేసిన కొన్ని నిమిషాలకే అధికారులు అలర్ట్‌ను ఎత్తివేశారు. యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాపై దాడులను తీవ్రతరం చేస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ ఘటనతో రియాద్‌లో భద్రతా పరిస్థితులపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక మార్గదర్శకాలను పాటించాలని సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com