పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- March 03, 2026
రియాద్: సౌదీ అరేబియా ప్రాంతాల ఎమిర్ల 33వ వార్షిక సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. దీనికి అంతర్గత మంత్రి ప్రిన్స్ అబ్దులాజీజ్ బిన్ సౌద్ బిన్ నయీఫ్ అధ్యక్షత వహించారు.ఈ సమావేశంలో భాగంగా పౌరులు, నివాసితులు మరియు సందర్శకుల భద్రతకు సంబంధించిన అన్ని విషయాలను చర్చించారు.
ప్రస్తుతం ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో భద్రతను బలోపేతం చేయడానికి, రాజ్యంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరినీ రక్షించడానికి మరియు విమానాశ్రయాలలో చిక్కుకున్న గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ పౌరులను ఆతిథ్యం ఇవ్వడానికి సంబంధించి తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు.
ప్రస్తుతం ఉద్రిక్తత పరిస్థితులు ఉన్నా.. భద్రతా పరంగా స్థిరంగా ఉందని, రోజువారీ జీవితం సాధారణంగా కొనసాగుతుందని వెల్లడించారు. విజన్ 2030కి అనుగుణంగా మెరుగైన జీవన నాణ్యతకు దోహదపే నివేదికలు మరియు వర్కింగ్ పేపర్లపై సమావేశంలో చర్చించారు.
రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీలను ఉపయోగించడం మరియు ప్రభుత్వ రంగ పనితీరులో రాణించడానికి స్మార్ట్ డిజిటల్ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లడంపై సమీక్షించారు. త్వరలోనే కింగ్ క్రౌన్ ప్రిన్స్‌కు అనేక సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పించనున్నట్లు వెల్లడించారు.
తాజా వార్తలు
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్‌లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు
- ఒమాన్‌లోని డుక్మ్ పోర్ట్ పై డ్రోన్ దాడి
- పాకిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వీసా అపాయింట్మెంట్ రద్దు









