యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!

- March 03, 2026 , by Maagulf
యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!

యూఏఈ: యూఏఈలోని బ్యాంకింగ్ మరియు ఆర్థిక సంస్థలు సాంకేతిక లోపం కారణంగా తాత్కాలిక అంతరాయాలను ఎదుర్కొంటున్నాయి.   తమ సేవల్లో తాత్కాలికంగా అంతరాయం ఏర్పడిందని అబుదాబి కమర్షియల్ బ్యాంక్ (ADCB) ధృవీకరించింది.

అయితే, తమ మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్ మరియు కాంటాక్ట్ సెంటర్ లలో సమస్యలు ఉన్నాయని ADCB తెలిపింది.  కస్టమర్లు ADCB ఇంటర్నెట్ బ్యాంకింగ్, శాఖలు, UBank ATMలు మరియు ADCB వాట్సాప్ బ్యాంకింగ్ ద్వారా సేవలను నిరాంతరాయంగా పొందవచ్చని తెలిపింది. 

మరోవైపు,  అంతర్జాతీయ మరియు దేశీయ బదిలీలు రెండూ బ్యాంక్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ప్లాట్‌ఫామ్ ద్వారా పూర్తిగా అందుబాటులో ఉన్నాయని, అల్ ఎతిహాద్ చెల్లింపుల ద్వారా ఆని యాప్ ద్వారా దేశీయ బదిలీలు కూడా అందుబాటులో ఉన్నాయని వెల్లడించింది. అయితే, సేవల్లో అంతరాయం ఎందుకు జరిగిందనేది బ్యాంక్ వెల్లడించలేదు.

యూఏఈలో ఆస్తుల పరంగా అతిపెద్ద బ్యాంకు అయిన ఫస్ట్ అబుదాబి బ్యాంక్ కూడా ఇంటర్నెట్ మరియు మొబైల్ బ్యాంకింగ్ సేవలల్లో అంతరాయాలను ఎదుర్కొన్నట్లు నివేదికలు వచ్చాయి. 

ఇదిలా ఉండగా, వీలైనంత త్వరగా పూర్తి సేవలను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నట్లు ADCB తెలిపింది. మరోవైపు, అల్ ఫర్దాన్ ఎక్స్ఛేంజ్ తన కొన్ని సేవలు తాత్కాలిక అంతరాయాలను ఎదుర్కొంటున్నాయని ప్రకటించింది.   

అంతకుముందు, యూఏఈలోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) డేటా సెంటర్ సేవల్లో కూడా అంతరాయాలు ఏర్పడ్డాయని ప్రకటించింది. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో డేటా సెంటర్ కు స్వల్ప నష్టం జరిగినట్టు నివేదికలు వచ్చాయి. దీంతో నెట్‌వర్కింగ్-సంబంధిత APIలకు నష్టం జరిగిందని, తద్వారా కస్టమర్లకు అందించే సేవల్లో అంతరాయాలు ఎదుర్కొన్నారని AWS తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com