‘టాక్సిక్’ విడుదల వాయిదా..కొత్త రిలీజ్ డేట్ ఇదే
- March 04, 2026
రాకింగ్ స్టార్ యశ్ హీరోగా, గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్’ (Toxic) విడుదల వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ చిత్రం మార్చి 19, 2026న థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం మధ్య ప్రాచ్య (Middle East) దేశాల్లో నెలకొన్న అస్థిరమైన పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో చిత్ర బృందం సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ముఖ్యంగా ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల అక్కడ సినిమా థియేటర్ల కార్యకలాపాలకు ఆటంకం కలిగే అవకాశం ఉంది. దీంతో గల్ఫ్ దేశాలు భారతీయ సినిమాలకు అతిపెద్ద మార్కెట్ కాబట్టి, ఆ ప్రభావం కలెక్షన్లపై పడకూడదని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తుంది. దీంతో తాజాగా కొత్త విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. ఈ సినిమాను జూన్ 04న విడుదల చేయబోతున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









