కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!

- March 04, 2026 , by Maagulf
కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!

కువైట్: ఇజ్రాయెల్-అమెరికా-ఇరాన్ వివాదం అనేక మంది అమాయకుల ప్రాణాలను తీసుకుంటుంది. తాజాగా కువైట్ లో ఓ 11 బాలిక ప్రాణాలను బలికొన్నది. క్యాపిటర్ గవర్నేట్ లో ఇరాన్ ప్రయోగించిన డ్రోన్ ను కువైట్ ఎయిర్ సెక్యూరిటీ వ్యవస్థలు కూల్చివేశాయి. ఈ క్రమంలో ఆ డ్రోన్ శకలాలు ఓ నివాస ప్రాంతంపై పడ్డాయి. ఈ దుర్ఘటనలో ఆ ఇంట్లో ఉంటున్న 11 ఏళ్ల బాలికతో సహా వారి ఫ్యామిలీ సభ్యులకు గాయాలయ్యాయి. 

అత్యవసర వైద్య బృందాలు వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరికొని వారిని సమీపంలోని అల్ అమిరి ఆస్పత్రికి తరలించారు. కాగా, అప్పటికే తీవ్రంగా గాయపడ్డ బాలిక చికిత్స పొందుతూ మరణించిందని కువైట్ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. ఇక మృతురాలి తల్లితో సహా మరో నలుగురు వైద్య పర్యవేక్షణలో ఉన్నారని ఒక ప్రకటనలో వెల్లడించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com