అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్

- March 04, 2026 , by Maagulf
అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్

దోహా: అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రులు మరియు గార్డియన్స్ తమ చర్యల పట్ల అప్రమత్తంగా ఉండాలని మరియు ప్రశాంతంగా ఉండాలని ఖతార్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) సూచించింది.  ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటనను షేర్ చేసింది.  

అత్యవసర పరిస్థితుల్లో తల్లిదండ్రుల ప్రవర్తన వారి పిల్లల భద్రత మరియు భరోసాను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.  పిల్లలను రక్షించడానికి తల్లిదండ్రులు అధికారుల మార్గదర్శకాలను పాటించాలని కోరింది. ఇంటిలో సురక్షితమైన స్థలాలను ఎంచుకొని క్షేమంగా ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది.  

ఇంతకుముందు, ప్రమాద స్థలాల వద్ద గుమిగూడ వద్దని, క్షేత్రస్థాయిలో ఏదైనా సంఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను తీయవద్దని లేదా వాటిని షేర్ చేయవద్దని మంత్రిత్వ శాఖ హెచ్చరిస్తూ.. ఒక ప్రకటన విడుదల చేసింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com