యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- March 04, 2026
మిడిల్ ఈస్ట్ లో ముదురుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో దౌత్య యుద్ధానికి దారితీస్తున్నాయి. యుద్ధంలోకి తమ దేశాన్ని లాగవద్దని, కేవలం శాంతిని కోరుకుంటున్నందుకు తమపై ఆంక్షలు విధించడం సరికాదని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ స్పష్టం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పెయిన్‌తో వాణిజ్య సంబంధాలను తెంచుకుంటామని హెచ్చరించిన నేపథ్యంలో, సాంచెజ్ నేడు జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్‌పై యుద్ధం ప్రకటిస్తున్న వారి లక్ష్యాల్లో స్పష్టత లేదని, స్పెయిన్ ఎన్నడూ ఇలాంటి రక్తపాతాన్ని కోరుకోలేదని ఆయన పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాలు యుద్ధాన్ని ఆపాలని పలు దేశాలు చేసిన తీర్మానాల తర్వాతే తాము ఈ డిమాండ్ చేస్తున్నామని గుర్తుచేశారు. ఒక దేశం చేసే చట్టవిరుద్ధమైన చర్యలకు మరో దేశం అదే స్థాయిలో స్పందించడం వల్ల మానవాళికి భారీ విపత్తులు తప్పవని ఆయన హెచ్చరించారు.
తాజా వార్తలు
- యుద్ధంలోకి మమ్మల్ని లాగకండి: స్పెయిన్ ప్రధాని
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!









