ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- March 05, 2026
అమరావతి: రాష్ట్రాన్ని సినీ, టెలివిజన్ రంగానికి ప్రధానకేంద్రంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.బుధవారం వెలగపూడి సచివాలయంలోని తన చాంబర్లో టెలివిజన్ ఫ్రెటర్నీటి ఫోరం సభ్యులు ఎఫిసి ఎండి విశ్వనాధన్తో కలసి మంత్రి దుర్గేష్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా బుల్లితెర కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను విన్నవించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ గత 45 ఏళ్ళుగా టివి పరిశ్రమ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, కళాకారులు ఉపాధికి అందిస్తున్న సహకారం అభినందనీయమన్నారు. విశాఖపట్టణం జిల్లా భీమిలి వద్ద కేటాయించిన స్థలంలో టివి నగర్ (నివాస స్థలాలు), స్టూడియోల నిర్మాణం కోసం సభ్యులు చేసిన అభ్యర్థనను సానుకూలంగా పరిశీలిస్తామన్నారు.
అమరావతి, వైజాగ్, రాజమండ్రి, తిరుపతి ప్రాంతాల్లో స్టూడియోల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. పెండింగ్లో ఉన్న టివి నంది అవార్డులను త్వరలోనే అందజేస్తామని, ఉగాధి పురస్కారాల్లో టివి కళాకారులకు తగిన ప్రాధాన్యత కల్పిస్తామని స్పష్టం చేశారు. దివంగత ప్రముఖులు సుమన్, దేవదాస్ కనకాల పేర్లతో కళాకారులను సత్కరించే ప్రతిపాదనను పరిశీలిస్తామన్నారు. షూటింగ్స్ కోసం ప్రభుత్వ స్థలాలు, ఆడిటోరియాలు, దేవాలయాలు, టూరిజం గెస్ట్ హౌస్లలో రాయీతీలు కల్పించే దిశగా నిర్ణయం తీసుకుంటామని మంత్రి దుర్గేష్ తెలి పారు. ప్రభుత్వానికి, టివి పరిశ్రమకు మధ్య వారధిగా పనిచేసేందుకు టెలివిజన్ ఫ్రెటర్నిట్ ఫోరమ్ను అనుసంధాన కమిటీగా గుర్తించాలన్నకోరికను పరిగణనలోనికి తీసుకుంటామని మంత్రి చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









