అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- March 05, 2026
హిందూ మహాసముద్రంలో ఇరానియన్ యుద్ధనౌక ఐరిస్ దేనాపై దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత, ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRTC) ఉత్తర పర్షియన్ గల్ఫ్‌లో ఒక అమెరికన్ ట్యాంకర్‌ను ఢీకొట్టినట్లు ప్రకటించింది. ఈ మేరకు రాయిటర్స్ పేర్కొంది. అమెరికా నౌక మంటల్లో చిక్కుకుందని ఇరాన్ మీడియా తెలిపింది. శ్రీలంక తీరంలో ఐరిస్ దేనాపై జరిగిన దాడికి అమెరికా కచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరించిన నేపథ్యంలో ఈ దాడి జరిగింది.ఇజ్రాయెల్, అమెరికా తమ లక్ష్యాలను చేరుకున్నాయని, ఈ నేపథ్యంలో ట్రంప్ ఎప్పుడైనా యుద్ధాన్ని ఆపివేయవచ్చని వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ అధికారి ఇరాన్‌లో పాలకులు మారే వరకు యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేశారు. పాలకులను మార్చుతామంటూ ఇజ్రాయెల్ చేసిన ప్రకటనపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.
గత కొన్ని రోజులుగా ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా జోక్యం చేసుకోవడంతో ఉద్రిక్తతలు పెరిగాయి. శ్రీలంక సమీపంలో ఇరాన్ నౌకను అమెరికా ముంచివేయడం ఇరాన్‌కు పెద్ద దెబ్బగా మారింది. దీనికి ప్రతికారంగానే అమెరికా ట్యాంకర్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య ఘర్షణలు సముద్ర మార్గాలకు పాకడంతో అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్‌ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









