కొంటె కుర్రాడు కిట్టు
- July 22, 2015
వెంకట్ తన స్నేహితుడు సుబ్బు ఊరి నుంచి వస్తున్నాడని రెండు మామిడిపళ్లు తెచ్చి పని కుర్రవాడు కిట్టుకిచ్చి తరిగి పెట్టమన్నాడు. కిట్టు ఆ సండ్లని లోపలికి తీసుకువెళ్లి తరిగి ఉంచమన్నాడు. కిట్టు ఆ పళ్లని తరిగి పెడితే తనకి నోరూరింది. దాంతో ఒక్క ముక్క నోట్లో వేసుకున్నాడు. ఇంకా తినాలనిపించింది. అలా ఒక్కొక్క ముక్క చొప్పున మొత్తం రెండు పళ్లు తినేసాడు. ఇంతలో వీధి చివర సుబ్బు వస్తుండడం చూసి కిట్టుని పిలిచి వెంకట్.. మామిడి పళ్లు తరిగావా? అని ఆడిగాడు. అందుకు కిట్టు తెలివిగా తరుగుదామంటే ఒక్క కత్తికీ పదును లేదయ్యా అని చెప్పాడు. ఇక్కడివ్వు పదును పెట్టిస్తాను అని పెరట్లోకి వెళ్లి కత్తికి పదును పెడుతున్నాడు. ఇంతలో గుమ్మం దగ్గర సుబ్బు రాకను గమనించిన కిట్టు అతనికి ఎదురెళ్లి మా అయ్యగారికి పిచ్చి పట్టింది. మీరొస్తే మీ చెవులు కోసేద్దామని కత్తికి పదును పెడుతున్నాడు. కావాలంటే చూడండని పెరట్లోకి తీసుకెళ్లి చూపించాడు. అక్కడ కత్తికి పదును పెడతూ వెంకట్ కనిపించాడు. కిట్టు చెప్పింది నిజమేననుకుని సుబ్బు పరుగు లంఘించుకున్నాడు. అప్పుడు కిట్టు వెంకట్ దగ్గరికి వచ్చి మీ స్నేహితుడు నా దగ్గరున్న రెండు మామిడి పండ్లను పట్టుకుని పారిపోతున్నాడు అని చెప్పాడు. ఆశపోతు వెధవా రెండు పండ్లూ పట్టుకుని పారిపోతున్నాడా? అని వెంటనే అక్కడి నుండి లేచి ఆగరా ఆగు ఒక్కటైనా ఇవ్వు అని అతని వెంట కత్తితో పరుగు పెట్టాడు. దాంతో సుబ్బు తన చెవుల్లో ఒక్కటైనా ఇవ్వు అంటున్నాడేమో అనుకుని రెండు చేతుల్లో రెండు చెవులు పట్టుకుని మరింత వేగంగా పరుగు అందుకున్నాడు. కిట్టు తెలివి బాగా పారింది. మామిడి పండ్లు తినాలన్న తన కోరిక తీరింది.
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







