తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- March 06, 2026
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సీనియర్ నాయకురాలు, వరంగల్ మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణను నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) జనరల్ సెక్రటరీ కె.సి.వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
ఎర్రబెల్లి స్వర్ణకు ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో విశేషమైన అనుభవం ఉంది. దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీకి విధేయురాలిగా కొనసాగుతున్న ఆమె, పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారు. గతంలో ఆమె ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు నిర్వర్తించి, క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్‌ను సమన్వయం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
2002లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికైన ఎర్రబెల్లి స్వర్ణ, నగరానికి మొట్టమొదటి మహిళా మేయర్‌గా సేవలు అందించారు. సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా కూడా గతంలో బాధ్యతలు నిర్వర్తించారు.ఎర్రబెల్లి స్వర్ణను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా నియమించడంతో కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు
- తెలంగాణ మహిళా కాంగ్రెస్ నూతన అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ
- టీవీ న్యూస్ ఛానళ్లకు కేంద్రం షాక్..
- ఏపీలో చిన్న పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
- అమెజాన్ లో ‘ఎలక్ట్రానిక్స్ ప్రీమియర్ లీగ్’ ..ఆఫర్స్
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!









