యూఏఈ లాటరీ..లక్కీ డే డ్రాలో 8,000 మందికి పైగా విజేతలు..!!
- March 08, 2026
యూఏఈః యూఏఈ లాటరీ వేలాది మంది నివాసితుల కలలను నిజం చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది. తాజా లక్కీ డే డ్రాలో DH100,000 గెలుచుకున్న మూడు లక్కీ IDలు CV7218771, DI8588080, BN3824781 గా ప్రకటించారు.ఈ వారం మొత్తం 8,299 మంది విజేతలు ఉన్నారు. నలుగురు వ్యక్తులు ఒక్కొక్కరు Dh100,000 గెలుచుకోగా, 87 మంది ఒక్కొక్కరు Dh1,000 గెలుచుకున్నారు. 8,200 మందికి పైగా ఒక్కొక్కరు Dh100 గెలుచుకున్నారు.
ప్రత్యక్ష ప్రసారం సందర్భంగా, Dh100 మిలియన్ల పెద్ద జాక్‌పాట్ విజేత అయిన భారతీయ ప్రవాస అనిల్‌కుమార్ బోల్లా మాట్లాడారు. ఈజీ పిక్ సర్వీస్ ద్వారా 12 టిక్కెట్లను ఎలా కొనుగోలు చేసినట్లు తెలిపాడు.వాటిలో ఒకటి తన తల్లి పుట్టిన తేదీతో తీసుకున్నట్లు పేర్కొన్నాడు. మరో విజేత అయిప భారతీయ ప్రవాసులు అనంత్ పెరుమల్‌సామి మరియు జగన్ బాబు వర్గీస్ తమ ఆశలు ఫలించాయని తెలిపారు. వచ్చిన బహుమతి సొమ్ముతో తమ కలలను నెరవేర్చుకుంటామని పేర్కొన్నారు.
కేవలం ఒకే డ్రాతో ప్రారంభించినప్పటి నుండి, యూఏఈ లాటరీ గత సంవత్సరంలో దాని పోర్ట్‌ఫోలియోను 20 గేమింగ్ అనుభవాలకు విస్తరించింది. వీటిలో ఫ్లాగ్‌షిప్ లక్కీ డే డ్రా, పిక్ 3, పిక్ 4 మరియు కలర్ ప్రిడిక్షన్ వంటి రోజువారీ గేమ్‌లతో పాటు విస్తృత శ్రేణి స్క్రాచ్ కార్డ్‌లు మరియు ఇ-ఇన్‌స్టంట్ గేమ్‌లు ఉన్నాయి.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









