భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- March 08, 2026
అహ్మదాబాద్: నేడు జరగబోయే హై-వోల్టేజ్ ఫైనల్ పోరు కు రంగం సిద్ధమైంది..అహ్మదాబాద్ స్టేడియంలో మిక్స్‌డ్ సాయిల్ పిచ్ (70% రెడ్, 30% బ్లాక్) రెడీ చేశారు. బౌలర్లకు బౌన్స్ లభిస్తుంది. పేసర్లకు సహకరిస్తుంది. బ్యాటర్లకూ అడ్వాంటేజ్ ఉంటుందని, భారీ స్కోర్ నమోదవ్వొచ్చని అంచనా.
అహ్మదాబాద్‌లో ఆదివారం వాతావరణం చాలా వేడిగా, పొడిగా ఉండనుంది. అక్యూవెదర్ నివేదికల ప్రకారం, వర్షం పడే అవకాశం అస్సలు లేదు. పగటి ఉష్ణోగ్రతలు 34 నుండి 41 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది. సాయంత్రం కూడా వాతావరణం 30 డిగ్రీల వరకు ఉంటూ కాస్త ఉక్కపోతగా అనిపించవచ్చు. వర్షం ముప్పు లేనందున అభిమానులు పూర్తి మ్యాచ్‌ను ఆస్వాదించవచ్చు.
నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ ఎర్ర, నల్ల మట్టి మిశ్రమంతో రూపొందించారు. ఇది బ్యాటింగ్‌కు స్వర్గధామంలా కనిపిస్తోంది, కాబట్టి పరుగుల వరద పారే అవకాశం మెండుగా ఉంది. అయితే, పిచ్ కంటే మైదానంలోని పరిస్థితులే మ్యాచ్ ఫలితాన్ని శాసించేలా ఉన్నాయి. రాత్రి వేళ మంచు (Dew) కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే చాలా మ్యాచ్‌ల ఫలితాలను మంచు ప్రభావితం చేసింది. టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకోవడం దాదాపు ఖాయం. ఒక మెగా ఫైనల్ ఫలితం కేవలం టాస్‌పైనే ఆధారపడితే అది క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగించే అంశమే.
తాజా వార్తలు
- ఇరాన్ కు అమెరికా మరో వార్నింగ్
- సౌదీలో భవన నిర్మాణ రంగం దూకుడు..!!
- ఇరాన్ దాడులకు మద్దతు కేసు..నిందితులకు షాకిచ్చిన కాసేషన్ కోర్టు..!!
- దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కు మంచిరోజులు వస్తాయి..భారత్‌లో పెట్టుబడులపై ఆసక్తి..!!
- కువైట్‌లో మండుతున్న ఎండలు.. ముగిసిన మిడ్ డే వర్క్ నిషేధం..!!
- రిమాల్ అల్ షర్కియాహ్ పర్యాటక ప్రాంత అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్..!!
- ‘ది న్యూయార్కర్’ కథనంపై తీవ్రంగా స్పందించిన ఖతార్..!!
- సెయింట్ లూయిస్‌లో NATS క్రీడా సంబరాలు
- రోబోటిక్, రిమోట్ సర్జరీతో వైద్య రంగంలో కువైట్ కీలక ముందడుగు
- సౌదీ రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2027కి వాయిదా







