ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- March 08, 2026
యూఏఈః గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడుల కారణంగా కొన్ని యూఏఈ ఆకర్షణలు తాత్కాలికంగా ప్రజలకు తలుపులు మూసివేసాయి. ఇరానియన్ డ్రోన్లు మరియు క్షిపణుల నిరంతరం అడ్డుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, దాడుల కారణంగా కాకుండా, వాటి శకలాల వల్ల గాయాలు సంభవించాయని యూఏఈ స్పష్టం చేసింది.
పరిస్థితి సురక్షితంగా ఉందని, యుద్ధం ఎంతకాలం కొనసాగినా దాడులను ఎదుర్కోవడానికి రక్షణ దళాలు పూర్తి సంసిద్ధతతో ఉన్నాయని అధికారులు తెలిపారు. అయినప్పటికీ, ప్రజల భద్రత కోసం జాగ్రత్తలు చాలా అవసరం అని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రధాన నిర్ణయాలను అధికారులు అమలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అధికారిక నిబంధనలకు అనుగుణంగా కొన్ని కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసాయి.
గ్లోబల్ విలేజ్
వారాంతాల్లో భారీగా విజిటర్స్ ను ఆకర్షించే దుబాయ్ లోని ప్రసిద్ధ ఆకర్షణ.. మార్చి 7 మరియు 8 తేదీలలో అధికారుల గైడ్ లైన్స్ ప్రకారం మూసివేయబడుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఐన్ దుబాయ్
ఐన్ దుబాయ్ కు సంబంధించి ఇప్పటికే బుకింగ్‌లు కలిగి ఉన్నవారు తాజా సమాచారం కోసం వెబ్‌సైట్‌ను సందర్శించాలని ప్రకటించింది. ఈ వీకెండ్ మూసివేయనున్నట్లు ప్రకటించారు.
పార్క్‌లు మరియు రిసార్ట్‌లు
ముందు జాగ్రత్త చర్యగా ఈ వీకెండ్ లో దుబాయ్ పార్క్‌లు మరియు రిసార్ట్‌లు మూసివేయబడతాయని వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ రిసార్ట్ గమ్యస్థానంలో రివర్‌ల్యాండ్ దుబాయ్‌తో పాటు మోషన్‌గేట్, లెగోలాండ్ వంటి ప్రధాన థీమ్ పార్కులు ఉన్నాయి. ఇవి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటాయి.
తాజా వార్తలు
- మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- భారత్-కివీస్ టీ20 ఫైనల్..
- మహిళలు అవకాశాలను అందిపుచ్చుకోవాలి: సీఎం రేవంత్
- ఇరాన్ పాఠశాలపై జరిగిన దాడిని ఖండించిన ట్రంప్
- 6 నెలల పోరాటానికి సిద్ధమన్న ఇరాన్!
- విమాన ప్రయాణికులకు బిగ్ అలర్ట్..
- 4 ఉమ్రా కంపెనీలను సస్పెండ్ చేసిన హజ్ మంత్రిత్వ శాఖ..!!
- మంచినీటిని వృధా చేసినందుకు రెస్టారెంట్‌కు నోటీసులు జారీ..!!
- ఈ వారాంతంలోనూ 3 యూఏఈ ఆకర్షణలు మూసివతే..!!
- చిక్కుకుపోయిన ప్రయాణికులకు కీలకమైన రవాణా కేంద్రంగా ఒమన్..!!









