ఫంకీ ఓటీటీ డేట్ ఫిక్స్

- March 08, 2026 , by Maagulf
ఫంకీ ఓటీటీ డేట్ ఫిక్స్

విశ్వక్ సేన్ మార్క్ మాస్ ఎనర్జీ, అనుదీప్ మార్క్ సెటైరికల్ కామెడీ కలగలిసిన చిత్రం ‘ఫంకీ’. గత నెల 13న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాలో విశ్వక్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినిమా విడుదలై నెలరోజులు అవుతుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూశారు. ఎట్టకేలకు ఫంకీ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది.

ఫంకీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. మార్చి 13, 2026 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ఫంకీ సినిమాను నిర్మించారు. హీరో, హీరోయిన్లతో పాటు నరేష్, సంపత్ రాజ్, మురళీధర్ గౌడ్, వీటీవీ గణేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. .. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com