దుబాయ్ రోడ్ క్లోజర్‌తో వాహనదారులకు ఇక్కట్లు
- August 01, 2016
గత నెలలో ప్రారంభమైన షేక్ జాయెద్ రోడ్ సౌత్ బౌండ్ కారణంగా వాహనదారులు చాలా ఊరట పొందినా, మరో క్లోజర్ కారణంగా వాహనదారులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ దుబాయ్ (ఆర్‌టిఎ) ఈ క్లోజర్ ద్వారా డేరా, కరామా, బుర్ దుబాయ్ ప్రాంతాలకు వెళ్ళే వాహనదారులకు ఇబ్బందులు తప్పకపోవచ్చని వెళ్ళడించింది. షేక్ జాయెద్ రోడ్ ఎగ్జిట్ (ఉమర్ హురైర్ రోడ్ నుండి) ఆగస్ట్ 1నుంచి ఫిబ్రవరి 2017 వరకు మూసివేయబడ్తుంది. రోడ్డు అభివృద్ధిలో భాగంగానే ఈ చర్య తీసుకున్నట్లు ఆర్‌టిఎ వర్గాలు వెల్లడించాయి. రోడ్ క్లోజర్ నేపథ్యంలో వాహనదారులు సహకరించాలనీ, ప్రత్యామ్నాయ మార్గాలపై అవగాహన పెంచుకోవాలని ఆర్‌టిఏ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







