సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు
- March 08, 2026
రియాద్: సౌదీ అరేబియాలోని అల్-ఖర్జ్ నగరంలోని నివాస ప్రాంతంలో ఆదివారం ఒక క్షిపణి (ప్రాజెక్టైల్) పడటంతో ఇద్దరు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారని సౌదీ సివిల్ డిఫెన్స్ అధికారులు తెలిపారు.
సివిల్ డిఫెన్స్ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ (X) లో తెలిపిన వివరాల ప్రకారం, మృతి చెందిన ఇద్దరిలో ఒకరు భారతీయుడు కాగా మరొకరు బంగ్లాదేశ్‌కు చెందిన వారని వెల్లడించారు.
క్షిపణి పడటంతో నివాస ప్రాంతంలో తీవ్ర నష్టం సంభవించగా, గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో సౌదీ అరేబియాలోని అల్-ఖర్జ్ సహా కొన్ని ప్రాంతాల్లో ఉన్న రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించినట్లు తెలిపింది.
ఈ ఘటన నేపథ్యంలో ప్రాంతంలో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు సౌదీ అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
- అమరవీరులకు కువైట్ కన్నీటి నివాళి: సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు
- లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా పై విపక్షాలు అవిశ్వాస తీర్మానం
- యూఏఈలో హెలికాప్టర్ ప్రమాదం: ఇద్దరు సాయుధ దళాల సిబ్బంది మృతి
- గల్ఫ్ దేశాల్లో 12వ తరగతి పరీక్షలు వాయిదా–CBSE కీలక నిర్ణయం
- 23400 ఉల్లంఘనలు..1,200 వాహనాలు సీజ్..!!
- వీడియోలు, ఫోటోలు షేర్.. 313 మంది అరెస్టు..!!
- విదేశాలలో చిక్కుకున్న ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!!
- ఆ రెండు కేసుల్లోనే అబార్షన్..షురా కౌన్సిల్ ఆమోదం..!!









