ధరల పెంపు..449 సంస్థలకు Dh176,000 ఫైన్స్..!!

- March 09, 2026 , by Maagulf
ధరల పెంపు..449 సంస్థలకు  Dh176,000 ఫైన్స్..!!

యూఏఈ: రమదాన్ ను పురస్కరించుకొని యూఏఈలో  వివిధ మార్కెట్లలో సుమారు 4,468 తనిఖీలు నిర్వహించినట్లు యూఏఈ ఆర్థిక మరియు పర్యాటక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సందర్భంగా 554 ఉల్లంఘనను గుర్తించినట్లు ప్రకటించింది. 

ముఖ్యంగా ధరలను ఇష్టానుసారంగా పెంచి కస్టమర్లను మోసం వాణిజ్య సముదాయాలకు 449 నోటీసులు జారీ చేసినట్లు తెలిపింది. మొత్తం Dh176,000 విలువైన జరిమానాలు విధించినట్లు మంత్విత్వశాఖ ప్రకటించింది.  

దుబాయ్‌లోని అల్ అవీర్ సెంట్రల్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ మార్కెట్‌లో అధికారులతో కలిసి ఆర్థిక మరియు పర్యాటక మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రి నిర్వహించిన క్షేత్రస్థాయిలో పర్యటించి ధరలను పరిశీలించారు.  నిరంతరం అధికారులు అవుట్‌లెట్‌లలో రోజువారీగా స్టాక్ ను పర్యవేక్షిస్తున్నారని మంత్రి వివరించారు.   

మంత్రిత్వ శాఖ రియల్ టైమ్ ధరల ట్రాకింగ్ కోసం ఎలక్ట్రానిక్ ధరల పర్యవేక్షణ వ్యవస్థను అమలు చేస్తుంది. ఇది సహకార సంఘాలు, హైపర్‌మార్కెట్లు మరియు సూపర్ మార్కెట్‌లతో సహా 627 ప్రధాన రిటైల్ అవుట్‌లెట్‌లతో అనుసంధానించబడి ఉందని మంత్రిత్వశాఖ తెలిపింది. ఇది దేశంలోని వినియోగ వస్తువులలో దాదాపు 90 శాతానికి సమానమని ప్రకటించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com