వంటగ్యాస్ పై రాయితీ పెంపు
- August 01, 2016
సబ్సిడీలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్‌పై మరోసారి ధరల మోత మోగించింది. రాయితీ సిలిండర్‌పై రూ.1.93 పెంచుతున్నట్లు ప్రకటించింది. నెల వ్యవధిలో రాయితీ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి. జులై 1న సబ్సిడీ ఎల్పీజీపై రూ.1.98 పెంచిన విషయం తెలిసిందే. నూతన నిర్ణయం ప్రకారం దిల్లీలో 14.2 కేజీల రాయితీ సిలిండర్ ధర రూ.423.09గా ఉంది.
వంటగ్యాస్, కిరోసిన్ రాయితీలను తగ్గించేందుకు ప్రభుత్వం నెలవారీగా ధరలను పెంచే పద్ధతిని చేపట్టింది. ఇప్పటికే ప్రతినెలా లీటర్ కిరోసిన్‌పై రూ.25 పెంచాలని నిర్ణయించగా.. తాజాగా రాయితీ వంటగ్యాస్‌పై కూడా దాదాపు రూ.2 పెంచేందుకు సిద్ధమైంది. మరోవైపు సబ్సిడీయేతర గ్యాస్ ధరలను మాత్రం సదరు చమురు కంపెనీలు తగ్గిస్తూ వస్తున్నాయి. గత నెలలో రూ.11 తగ్గించగా.. తాజాగా 14.2 కిలోల సిలిండర్ ధరపై రూ.50.5 తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో దిల్లీలో సబ్సిడీయేతర వంటగ్యాస్ సిలిండర్ ధర రూ.487గా ఉంది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







