ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీ మారిపోయింది..
- March 09, 2026
టీ20 ప్రపంచకప్ 2026 ముగిసింది. భారత జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ముచ్చటగా మూడోసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఇక క్రికెట్ ప్రేమికుల దృష్టి అంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 పై పడింది.కాగా..ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీ మారిపోయింది. మార్చి 28 నుంచి ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది.
ఈ విషయాన్ని అధికారిక బ్రాడ్ కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ వెల్లడించింది. ఆదివారం అహ్మదాబాద్‌లో నరేంద్రమోదీ స్టేడియంలో టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఈ విషయాన్ని తెలిపింది. వాస్తవానికి ఐపీఎల్ 2026 మార్చి 26 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. సీజన్‌కు ముందు ప్లేయర్లకు, ఫ్రాంఛైజీలకు కాస్త సమయం ఇచ్చేందుకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2026 ప్రారంభ తేదీ పై స్పష్టత వచ్చినప్పటికి కూగా ఇప్పటి వరకు షెడ్యూల్‌ను బీసీసీఐ విడుదల చేయలేదు.
బెంగళూరులో ఐదు మ్యాచ్‌లు..
ఐపీఎల్ 2026 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ హోమ్ గేమ్‌లలో ఐదింటిని చిన్నస్వామి స్టేడియంలో నిర్వహించనున్నట్లు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం కార్యదర్శి సంతోషన్ మీనన్ తెలిపారు. టోర్నమెంట్‌లోని ప్లేఆఫ్స్ మ్యాచ్‌ల్లో ఒకదానితో పాటు ఐపీఎల్ 2026 ఫైనల్‌కు కూడా చిన్నస్వామి ఆతిథ్యం ఇస్తుందని వెల్లడించారు.
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీ మిగిలిన రెండు హోమ్ మ్యాచ్‌లను ఛత్తీస్ గడ్‌లోని రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఆడనుంది.
తాజా వార్తలు
- సౌదీ అరామ్కో భవనాన్ని పరిశీలించిన డిప్యూటీ ఎమిర్..!!
- ఖతార్‌లో ప్రైవేట్ స్కూల్స్, కిండర్గార్టెన్లకు కొత్త మార్గదర్శకాలు..!!
- COP31 సదస్సులో ఒమన్..2050 నాటికి నెట్‌జీరోకు కృషి..!!
- కువైట్‌లో వాహనదారులకు ట్రాఫిక్ సేవలు మరింత సులభతరం..!!
- బహ్రెయిన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. కౌన్సిల్ కీలక నిర్ణయం..!!
- 2027 నుంచి యూఏఈలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు.. మార్పులివే..!!
- కన్ఫామ్ టికెట్ లేకుంటే వందే భారత్ ఎక్కలేరు
- తాజా ప్రాంతీయ పరిస్థితులపై సౌదీ, ఒమన్ చర్చలు..!!
- హమద్ విమానాశ్రయంలో ఉచితంగా షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శన..!!
- కువైట్ లో టెలికమ్యూనికేషన్ సేవలు ఆధునికీకరణ..!!







