ఒమన్‌లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!

- March 10, 2026 , by Maagulf
ఒమన్‌లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!

మస్కట్: ఒమన్ సుల్తానేట్ సహా మధ్యప్రాచ్యంలో పదే పదే వాయిదాలు కొనసాగుతున్నందున సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) పన్నెండో తరగతి బోర్డు పరీక్షలకు హాజరవుతున్న 2,200 మందికి పైగా విద్యార్థులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు.
తాజా CBSE సర్క్యులర్ ప్రకారం, మార్చి 12 నుండి మార్చి 16 వరకు జరగాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయి. కొత్త తేదీలు ఇంకా ప్రకటించబడలేదు. మార్చి 16 తర్వాత పరీక్షలకు మార్చి 14న సమీక్ష నిర్వహించనున్నారు.ఈ క్రమంలో పరీక్షలకు సిద్ధమవుతున్న ఒమన్‌లోని విద్యార్థులు పలువురు నిరాశ వ్యక్తం చేశారు.
గత మే నుండి తాను పరీక్షలకు సిద్ధముతున్నానని, కానీ ఏదో ఒక కారణం వల్ల పరీక్షలను వాయిదా వేస్తున్నారని ఓ స్టూడెంట్ వాపోయాడు. పరిస్థితులు బాగా లేని దేశాలలో పరీక్షలను వాయిదా వేయాలని, కానీ ఒమన్‌లో ఎందుకు వాయిదా వేశారని ఒక విద్యార్థి ప్రశ్నించాడు. పరీక్షలు ఇలాగే వాయిదా పడుతుంటే తాను అస్సలు చదువుకోలేనేమో అని మరో స్టూడెంట్ నిరుత్సాహ పడ్డాడు.  
అయితే, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని CBSE XII తరగతి పరీక్షలను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ఒమన్‌లోని ఇండియన్ స్కూల్స్ బోర్డు ఛైర్మన్ సయ్యద్ సల్మాన్ అన్నారు. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితి అందరికీ కష్టమైన మరియు అనూహ్యమైన వాతావరణాన్ని సృష్టించిందని, CBSE XII తరగతి పరీక్షలను వాయిదా వేయాలనే నిర్ణయం తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ అనిశ్చిత సమయాల్లో ఈ ప్రాంతమంతా విద్యార్థులందరి భద్రత మరియు శ్రేయస్సును CBSE పరిగణనలోకి తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశౄరు. పరీక్షల వాయిదా ఒక ఎదురుదెబ్బగా చూడవద్దని, తమ ఎగ్జామ్ తయారీని మరింత పదును పెట్టడానికి ఒక అవకాశంగా మార్చుకోవాలని సల్మాన్ విద్యార్థులకు సూచించారు.

  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com