కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- March 10, 2026
కువైట్ః ప్రాంతీయ పరిణామాల మధ్య భారతీయ పౌరులకు సహాయం చేయడానికి తీసుకుంటున్న చర్యల గురించి చర్చించడానికి కువైట్‌లోని భారత రాయబారి పరమిత త్రిపాఠి.. ఇండియన్ కమ్యూనిటీ సభ్యులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. కువైట్ ఎటువంటి భారీ దాడులను లేదా తీవ్ర ఆందోళన కలిగించే పరిణామాలను ఎదుర్కోలేదని రాయబారి భరోసా ఇచ్చారు.
కువైట్ వైమానిక ప్రాంతం మరికొన్ని రోజులు మూసివేయబడుతుందని భావిస్తున్నట్లు రాయబారి త్రిపాఠి తెలిపారు. కమ్యూనిటీ వాలంటీర్లు మరియు సంస్థల మద్దతుతో రాయబార కార్యాలయం అనేక మంది ప్రయాణీకులను వారి స్వదేశానికి తిరిగి పంపడానికి సహాయం అందించగలిగిందని ఆమె వెల్లడించారు. తమకు మద్దతుగా నిలిచిన కమ్యూనిటీ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం కువైట్‌లో ఉన్న సందర్శకులకు సంబంధించి ప్రభుత్వం జరిమానాలు లేదా అదనపు రుసుములు లేకుండా సందర్శన వీసాలను ఒక నెల పాటు పొడిగించిందని గుర్తుచేశారు.అయితే, వ్యక్తిగత లేదా అత్యవసర కారణాలు ఉన్నవారిని సౌదీ అరేబియా ద్వారా పంపడానికి రాయబార కార్యాలయం కృషి చేస్తోందన్నారు.
ప్రయాణించాలని ప్లాన్ చేస్తున్న నివాసితులు తప్పనిసరిగా ఎగ్జిట్ పర్మిట్ పొందాలని సూచించారు. సహాయం కోసం సంబంధిత వివరాలను [email protected] వద్ద ఉన్న రాయబార కార్యాలయానికి పంపాలని కోరారు.
కువైట్‌లోని రాయబార కార్యాలయం న్యూఢిల్లీలోని అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని, అలాగే ఈ ప్రాంతంలోని భారత మిషన్లతో సమన్వయం చేసుకుంటున్నట్లు రాయబారి త్రిపాఠి తెలిపారు. పరిస్థితి త్వరలో మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్‌కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్‌లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









