మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- March 10, 2026
మనామా: బహ్రెయిన్ రాజధాని మనామాలోని ఒక నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఇరాన్ దాడిలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరికొందరు గాయపడినట్లు బహ్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, ఈ దాడి ఒక నివాస భవనాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన స్పష్టమైన శత్రు చర్యగా పేర్కొంది. దాడి కారణంగా భవనానికి గణనీయమైన నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
గాయపడిన వారిని తక్షణమే సమీప ఆసుపత్రులకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారని అధికారులు వెల్లడించారు. వారి ఆరోగ్య పరిస్థితి పై వైద్య బృందాలు నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ ఘటన పై భద్రతా మరియు అత్యవసర సేవల బృందాలు వెంటనే స్పందించి సంఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు కూడా అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ రక్షణ దళాల చర్య: బాలిస్టిక్ క్షిపణి, రెండు డ్రోన్లు నిర్వీర్యం
- గ్యాస్ వినియోగదారులకు షాక్
- విదేశాల్లో ఇరానీయులకు హెచ్చరిక, దేశద్రోహం చేస్తే మరణశిక్ష
- రాత్రి సమయంలో ఎమర్జెన్సీ అలర్ట్ సౌండ్ లో మార్పు
- అబుదాబి నుండి భారత్‌కు ఎతిహాద్ విమానాలు–నేటి షెడ్యూల్
- మనామాలో నివాస భవనం పై ఇరాన్ దాడి: ఒకరు మృతి, పలువురికి గాయాలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్‌లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!









