ముగియనున్న మలేషియా మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం 2.0 ఆమ్నెస్టీ పథకం
- March 12, 2026
కౌలాలంపూర్: ఉపాధి కోసం వెళ్లి అక్కడ అనివార్యమైన పరిస్థితుల్లో ఇబందుల్లో చిక్కుకొని స్వదేశానికి రాలేని అక్రమ వలసదారులకు మలేషియా ప్రభుత్వం మైగ్రంట్ రేపట్రియేషన్ ప్రోగ్రాం ఆమ్నెస్టీ (క్షమాభిక్ష) ప్రకటించింది.అది ఇప్పుడు వచ్చే నెల ఏప్రిల్ 30, 2026 కి ముగుస్తుంది.ఈ గడువు లోపు పాస్‌పోర్ట్ లేకుండా వున్నవాళ్లు,వర్క్ పర్మిట్ వీసాల గడువు ముగిసినవారు మలేషియా వదిలి వెళ్ళినట్లయితే వారు ఎటువంటి చట్టపరమైన ఇబ్బందులు లేకుండా భారత్‌కు వెళ్ళవచ్చు.
ఈ ఆమ్నెస్టీ ద్వారా తమ స్వదేశాలకు వెళ్లే వారు 500 రింగ్గిట్ మలేషియా (ఇండియన్ కరెన్సి లో రూ.10000) చెలించాల్సివుంది.అలాగే వారు పాసుపోర్టు, పాసుపోర్టు లేని వారు ఎమర్జెన్సీ ట్రావెల్ సర్టిఫికెట్ మరియు సొంతంగా వారం రోజుల్లో వెళ్లే విధంగా ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ కు చెందిన భారతీయ కార్మికులు మలేషియా లో పనిచేస్తున్నారు, ఇక్కడ ఏజెంట్ల చేతిలో మోసపోయి అక్రమ కార్మికులుగా నివసిస్తున్నారు . ఏజంట్లు మంచి జీతం తో కూడిన ఉద్యోగం ఇస్తామని ఆశ చూపి ఈ కార్మికులను విజిట్ వీసా పైన తీసుకువచ్చి వర్క్ పర్మిట్ ఇవ్వకుండా మోస పోయిన వారు చాల మంది వున్నారు. ఈ కార్మికులు ఎక్కువగా పామ్ ఆయిల్ తోటలలో, రబ్బర్ తోటలలో, కన్స్ట్రక్షన్ మరియు హోటల్స్ ల లో పని చేస్తున్నారు.
ఏప్రిల్ 30వ తేదీ లోపు ఈ అవకాశాన్ని వాడుకోని వారిపై మలేషియా అధికారులు కఠినంగా వ్యవహరించే సూచనలు కనిపిస్తున్నాయి.గడువు ముగిసిన వెంటనే దేశవ్యాప్తంగా ముమ్మర తనిఖీలు చేపట్టి, అక్రమ వలసదారులను గుర్తించి అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకసారి అరెస్ట్ అయితే భారీ జరిమానాలతో పాటు జైలు శిక్ష కూడా అనుభవించాల్సి రావచ్చు.
ఈ ఆమ్నెస్టీ సంబంధించి ఏదయినా సహాయం కావలసినవారు ఫెడరేషన్ ఆఫ్ ఎన్నారై కల్చరల్ అసోసియేషన్స్, మలేషియాను [email protected] or http://website www.fnca.com.my సంప్రదించాలని ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి కోరారు.


తాజా వార్తలు
- అజ్మాన్ రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయిన భారతీయుడికి Dh650,000 పరిహారం
- కెప్టెన్ స్మిత్ మచ్చర్‌కు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రశంసలు
- సౌదీ అరేబియా జెడ్డాలో 11వ ఆయుర్వేద దినోత్సవం ఘనంగా నిర్వహణ
- పైలట్ కెప్టెన్ స్మిత్ కు గుజరాత్ గరిమా అవార్డు.. సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటన
- ఒమన్‌లో 3.4% పెరిగిన ఆరోగ్య సంస్థలు..!!
- వృద్ధుల హెల్త్ చెకప్స్.. బహ్రెయిన్ ఎంపీ కీలక ప్రతిపాదనలు..!!
- యూఏఈలో కొత్త ప్రయాణ ప్రత్యామ్నాయంగా ఎతిహాద్ రైలు..!!
- ఖతార్ లో ప్లాంట్ 10 మిలియన్ ట్రీస్ ప్రాజెక్టులో భారీ పురోగతి..!!
- సౌదీలో పార్కింగ్‌పై కొత్త నిబంధనలు..!!
- కువైట్‌లో నిర్మాణ వ్యర్థాలు.. ఓనర్లకు కీలక సూచనలు..!!







