సౌదీలో చిక్కుకున్న భారతీయులను తీసుకొస్తాం: సుష్మా
- August 01, 2016
దిల్లీ: సౌదీ అరేబియాలో ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న దాదాపు 10 వేలమంది భారతీయులను స్వదేశానికి తీసుకురానున్నట్లు విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్ వెల్లడించారు. ఐదు శిబిరాలు నిర్వహిస్తూ బాధితులకు ఆశ్రయమిస్తున్నామని... ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భారతీయ కార్మికుల తరలింపు ప్రక్రియను పర్యవేక్షించేందుకుగాను విదేశాంగశాఖ సహాయమంత్రి వీకే సింగ్ సౌదీ వెళ్లనున్నట్లు పునరుద్ఘాటించారు. సౌదీలో ఆకలితో అలమటిస్తున్న భారతీయుల భవిష్యత్తుపై లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఆందోళన వ్యక్తంచేసిన నేపథ్యంలో... ఉభయ సభల్లో సుష్మ సోమవారం ఓ ప్రకటన ద్వారా ఈ మేరకు వివరాలు వెల్లడించారు.
కార్మికుల ఆకలి తీర్చడానికి సౌదీలో మనదేశ దౌత్య కార్యాలయం ఐదు శిబిరాలను నిర్వహిస్తోందని... 10 రోజులకు సరిపడా రేషన్‌ను బాధితులకు పంచిపెట్టామని సుష్మ తెలిపారు. అక్కడి పరిస్థితులపై గంటగంటకూ తాను వివరాలు తెలుసుకుంటున్నానని పేర్కొన్నారు. బాధితులందరినీ స్వదేశానికి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. త్వరితగతిన తరలింపు ప్రక్రియ చేపట్టేందుకుగాను సౌదీ అధికారవర్గాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. యజమానుల నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం లేకుండా ఉద్యోగులను తరలించడానికి సౌదీలో చట్టాలు అనుమతించవని సూచించారు. యజమానులు తమ సంస్థలను మూసివేసి దేశం విడిచి వెళ్లడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు వివరించారు. కార్మికులకు రావాల్సిన బకాయిలు వారికి అందేలా చర్యలు తీసుకోవాలని సౌదీ ప్రభుత్వానికి విన్నవించినట్లు తెలిపారు. యజమానులు దేశం విడిచి వెళ్లినందువల్ల కార్మికులకు తిరుగుప్రయాణ వీసాలు అందజేయాలనీ కోరినట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







