'ఎల్ 7' ప్రచార చిత్రం విడుదల
- August 02, 2016
అరుణ్ అదిత్, పూజ ఝవేరి జంటగా నటించిన చిత్రం 'ఎల్ 7'. ముకుంద్ పాండే దర్శకత్వం వహిస్తున్నారు. బి.ఓబుల్‌రెడ్డి నిర్మాత. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రచారచిత్రాన్ని విడుదల చేశారు. దర్శకుడు విజయ్ కుమార్ కొండా, నిర్మాతలు గొట్టిముక్కల పద్మారావు, డి.ఎస్.రావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. నిర్మాత మాట్లాడుతూ ''ముకుంద్ చెప్పిన కథ నచ్చడంతో ఆయన్నే దర్శకత్వం చేయమని కోరా. కొత్త దర్శకుడే అయినా చాలా బాగా తెరకెక్కించాడు. హారర్, థ్రిల్లర్ అంశాలతో కూడిన ఈ చిత్రం మంచి వినోదాన్ని పంచుతుంది. భోజ్‌పురిలో అగ్ర కథానాయకులతో సినిమాలు చేసిన నాకు తెలుగులో నిర్మాతగా పేరు తెచ్చుకోవాలని ఉంది. ఇక్కడ రెండో ప్రయత్నంగా చేస్తున్న ఈ చిత్రంతో తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకొంటాం'' అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ''విభిన్నమైన కథతో తెరకెక్కించిన చిత్రమిది. ప్రేమలో ఏడు కోణాల్ని తెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశా. నిర్మాత, నటీనటుల సహకారంతో ఓ మంచి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం'' అన్నారు. ''దర్శకుడు ముకుంద్‌పాండే ప్రతిభావంతుడు. మంచి అభిరుచి గల నిర్మాత ఓబుల్‌రెడ్డి. వాళ్లిద్దరూ కలిసి చేసిన ఈ ప్రయత్నం తప్పకుండా ఫలితాన్ని సొంతం చేసుకొంటుంది'' అన్నారు అతిథులు.
తాజా వార్తలు
- నైజీరియాలో మసీదులో బాంబు పేలుడు 10 మంది మృతి
- దుబాయ్‌లో తెలుగు ప్రవాసుల ఘన క్రిస్మస్ వేడుకలు
- ఫ్లైనాస్ విమానానికి బాంబు బెదిరింపు..శంషాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్
- కాలిఫోర్నియాలో ఇండియన్ సర్వీస్ సెంటర్ ఫ్రారంభం
- నిషేధిత లేదా నకిలీ పెస్టిసైడ్స్ తయారీ, దిగుమతి పై భారీ జరిమానా
- శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా
- అంతర్జాతీయ సైబర్ నెట్వర్క్ గుట్టురట్టు చేసిన సీఐడీ
- అర్జున అవార్డు రేసులో తెలంగాణ క్రీడాకారులు
- శంకర నేత్రాలయ లాస్ ఏంజెలెస్ చాప్టర్ కార్యక్రమం ఘన విజయం
- మౌలానా అబుల్ కలాం అజాద్ అవార్డు గ్రహీత సయ్యద్ నాజర్‌కు ఘన అభినందన సభ







