నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్

- March 15, 2026 , by Maagulf
నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్

న్యూ ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించింది. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్నాయి.

ఎన్నికల సంఘం వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 9న అస్సాం, కేరళ మరియు పుదుచ్చేరిలో పోలింగ్ నిర్వహించనున్నారు. తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి.

పశ్చిమ బెంగాల్‌లో మాత్రం రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశ పోలింగ్ ఏప్రిల్ 23న జరగగా, రెండో దశ ఏప్రిల్ 29న జరుగుతుంది.

నాలుగు రాష్ట్రాలు మరియు పుదుచ్చేరి కలిపి మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే తమిళనాడులో 234, పశ్చిమ బెంగాల్‌లో 294, కేరళలో 140, అస్సాంలో 126 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com