మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ తో మాగల్ఫ్ ముఖాముఖీ

- March 15, 2026 , by Maagulf
మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ తో మాగల్ఫ్ ముఖాముఖీ

చార్మింగ్ స్టార్ శర్వా మోస్ట్ ఎవైటెడ్  స్పోర్ట్స్ డ్రామా బైకర్. మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ పవర్ ఫుల్ పాత్రని పోషించారు.అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో ప్రతిష్టాత్మక బ్యానర్ UV క్రియేషన్స్ నిర్మాణంలో భారతదేశపు మొట్టమొదటి కంప్లీట్ మోటోక్రాస్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. క్యారెక్టర్ గ్లింప్స్, సినిమాలోని మొదటి రెండు పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఏప్రిల్ 3న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.  
 
ఈ ప్రాజెక్టులోకి ఎలా వచ్చారు?

-సాహో తర్వాత ఒక మంచి కం బ్యాక్ ఫిలిం కోసం ఎదురు చూస్తున్నాను. ఆ సమయంలో యువి క్రియేషన్స్ వంశీ గారు ఈ ప్రాజెక్టు గురించి చెప్పారు. తర్వాత దర్శకుడు అభిలాష్ గారిని కలిశాను. ఆయనతో నాకు చాలా విషయాల్లో సిమిలారిటీస్ అనిపించాయి. ఆయన కథ చెప్పినప్పుడు ఇది ఖచ్చితంగా నాకు మంచి కం బ్యాక్ ఫిలిం అవుతుందని బలంగా అనిపించింది. స్క్రిప్ట్ చాలా అద్భుతంగా ఉంది. ఎమోషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది.

-శర్వా రన్ రాజా రన్ సినిమాతోనే నేను ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అయ్యాను. ఇప్పుడు మళ్లీ ఈ సినిమాతో ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా నాకు మంచి కం బ్యాక్ ఇస్తుందని నమ్ముతున్నాను.

రేసింగ్ సినిమాలు తెలుగులో చాలా అరుదుగా కదా..ఈ సినిమా మేకింగ్ గురించి?
-ఈ సినిమా మేకింగ్ ఒక హాలీవుడ్ లెవెల్‌లో ఉంటుంది. దర్శకుడు అభిలాష్ గారి ఆలోచన కూడా అదే. ఇందులో కేవలం రేసింగ్, యాక్షన్ మాత్రమే కాదు, చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ ఫ్యామిలీ కంటెంట్ కూడా ఉంది.

-రేసింగ్ యాక్షన్, టెక్నికల్ వాల్యూస్ తో పాటు కుటుంబ భావోద్వేగాలు చాలా బలంగా ఉంటాయి. ఒక క్రీడాకారుడైనా, రేసర్ అయినా అతనికి ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీలో ఉండే ఎమోషన్స్ ఇందులో చాలా ప్రత్యేకంగా వుంటుంది.ఈ సినిమాలో రేసింగ్, ఫ్యామిలీ ఎమోషన్స్ రెండూ చాలా బాగా బ్లెండ్ అయ్యాయి.

ఫస్ట్ కాపీ చూసిన తర్వాత మీకు ఎలాంటి ఎలిమెంట్స్ బాగా నచ్చాయి?
-సినిమా మొత్తం చాలా అద్భుతంగా వచ్చింది. ముఖ్యంగా రేసింగ్ సన్నివేశాలు ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ అనుభూతి ఇస్తాయి. బైక్ రేసింగ్ గురించి పెద్దగా తెలియని వారికి కూడా ఈ సినిమాలో చూపించిన రేసింగ్ చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తుంది.అలాగే తండ్రి–కొడుకు మధ్య ఉండే ఎమోషన్ కూడా చాలా బాగా చూపించారు.యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఇష్టపడతారు.

ఈ జోనర్ సినిమాకి మ్యూజిక్ చేయడంలో ఎలాంటి ఛాలెంజెస్ ఎదురయ్యాయి?
రేసింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సినిమాలు అంటే చాలా మంది హాలీవుడ్ సినిమాలతో పోల్చుతారు. ఎక్కడికి వెళ్లినా ఎఫ్ 1 లాంటి మ్యూజిక్ చేయమని అడిగేవారు.నిజానికి ఈ సినిమా అనుకున్నపుడు ఎఫ్ 1 ఇంకా రాలేదు.కాకపోతే మేము మా సినిమాకి ఎలాంటి మ్యూజిక్ కావాలో అలా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాం.ప్రేక్షకులకు కూడా అది నచ్చుతుందని చాలా నమ్మకంగా ఉన్నాం.

సౌండ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?
-రేసింగ్ సన్నివేశాల్లో బైక్స్ నుంచి వచ్చే సౌండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ సౌండ్స్ వల్ల మ్యూజిక్ వినిపించకుండా పోకూడదు.అందుకే కొత్త టెక్నాలజీ ఉపయోగించి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ బ్యాలెన్స్‌గా ఉండేలా చేశాం.

శర్వా పర్ఫార్మెన్స్ గురించి?
ఈ సినిమా చూసిన తర్వాత శర్వానంద్ పర్ఫార్మెన్స్ గురించి చాలా ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.ఆయనకు చాలా మంచి పేరు వస్తుంది.మ్యూజిక్ చేతునప్పుడు నాకు కొత్త శర్వానంద్ కనిపించారు.ఈ సినిమా ఆయనకు గొప్ప పేరు తీసుకొస్తుందని నమ్ముతున్నాను.

దర్శకుడు అభిలాష్ గురించి?
అభిలాష్ చాలా క్రమశిక్షణ గల దర్శకుడు.ఆయన దృష్టి ఎప్పుడూ సినిమాపైనే ఉంటుంది. సినిమాలో ఎనిమిది పాటలు ఉన్నాయి.అందులో ఒకటి పూర్తి పాటగా ఉంటుంది, మిగతావి మాంటేజ్ సాంగ్స్.మ్యూజిక్ విషయంలో ఆయనకు చాలా క్లారిటీ ఉంది.ఎలాంటి మ్యూజిక్ కావాలో స్పష్టంగా చెబుతారు.తప్పకుండా ఆయన తెలుగు పరిశ్రమలో ఒక మంచి దర్శకుడిగా నిలుస్తారని నమ్ముతున్నాను.

యువి క్రియేషన్స్ గురించి?
వంశీ గారు నాకు ఒక బ్రదర్‌లా ఉంటారు. ఆయనకు నా మ్యూజిక్‌పై మంచి నమ్మకం ఉంది. మేము కలిసి చేసిన రన్ రాజా రన్, జిల్, సాహో సినిమాల్లో మ్యూజిక్‌కు మంచి ప్రశంసలు వచ్చాయి.ముఖ్యంగా సాహో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందరికీ నచ్చింది.వంశీ ఎప్పుడూ నాకు చాలా సపోర్ట్ ఇస్తారు.ఆయన ప్రోత్సాహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. బైకర్ సినిమాలో ప్రేక్షకులు నా నుంచి కొత్త మ్యూజిక్ వింటారు.

ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులు?
-ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతం తెలుగులో బైకర్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. అలాగే తమిళంలో లీడర్ అనే సినిమా చేశాను. అది కూడా ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com