సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్

- March 19, 2026 , by Maagulf
సోషల్ మీడియా కంటెంట్ బ్లాకింగ్ పై కేంద్రం కొత్త రూల్స్

న్యూ ఢిల్లీ: డిజిటల్ యుగంలో కృత్రిమ మేధ (AI) సృష్టిస్తున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది.ఇప్పటి వరకు కేవలం ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) కి మాత్రమే ఉన్న ‘కంటెంట్ బ్లాకింగ్’ అధికారాలను ఇప్పుడు ఇతర కీలక శాఖలకు కూడా విస్తరించాలని యోచిస్తోంది.

అధికారాల విస్తరణ – ఏయే శాఖలకు?
సెక్షన్ 69(A) కింద ప్రస్తుతం ఉన్న నిబంధనలను సవరించి, కింద పేర్కొన్న మంత్రిత్వ శాఖలకు నేరుగా కంటెంట్ తొలగించే అధికారం ఇవ్వనున్నారు:

  • హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA)
  • విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)
  • రక్షణ మంత్రిత్వ శాఖ (MoD)
  • సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ (I&B)
  • ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY)

దీంతో పాటు సెబీ (SEBI) వంటి రెగ్యులేటరీ సంస్థలకు కూడా ఆర్థికపరమైన తప్పుడు సమాచారాన్ని (Scams) అడ్డుకోవడానికి నేరుగా సోషల్ మీడియా సంస్థలకు ఆదేశాలు జారీ చేసే అధికారం కల్పించే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వ్యాపిస్తున్న తప్పుడు సమాచారం, డీప్‌ఫేక్ వీడియోల సమస్యను పరిష్కరించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ మార్పుల వల్ల యూజర్లపై చేసే విమర్శలు లేదా సెటైరికల్ పోస్టులు కూడా తొలగించే ప్రమాదం ఉందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com