యువతీ హత్య కేసులో తాగుబోతుకు 4 ఏళ్ళ జైలు, 180 కొరడా దెబ్బల శిక్ష

- August 02, 2016 , by Maagulf
యువతీ  హత్య కేసులో  తాగుబోతుకు 4 ఏళ్ళ  జైలు, 180 కొరడా దెబ్బల  శిక్ష

అజ్మన్ : తప్పతాగి  తన స్నేహితురాలని దారుణంగా హత్య చేసిన ఓ వ్యక్తిని  అజ్మన్ కోర్టు దోషిగా నిర్ణయించి  నాలుగు సంవత్సరాల జైలుశిక్ష  మరియు 180 కొరడా దెబ్బలను విధించింది. నిందితుడు ఎన్ .ఎస్ .కె ,( 31) మూడు సంవత్సరాల క్రితం ఒక యువతిని  హోటల్ అపార్ట్మెంట్లో గొంతునులిమి క్రూరంగా హత్యచేశాడని కోర్టు గుర్తించింది. హంతకుడు  బాధితురాలి కుటుంబానికి, రక్త డబ్బు(దియా) అని పిలుస్తారు. ఆ మొత్తాన్ని 367,000 డి హెచ్  చెల్లించమని  ఆదేశించింది.బాధితురాల పేరు  బి .ఎఫ్.ఆర్. ఒక 23 ఏళ్ల ఆసియా దేశస్థురాలిగా గుర్తించబడినది.

అరబ్ మాధ్యమాలు తెలిపిన వివరాల  ప్రకారం, అక్రమ సంబంధాల ఆరోపణలు, మరియు మద్యం వినియోగం ఆరోపణలపై హంతకునికి 180 కొరడా దెబ్బల శిక్ష విధించబడింది, అదేవిధంగా  దేశ బహిష్కరణ సైతం అమలుచేయనున్నారు.యువతిని హత్య చేసిన నిందితుడు  ఒక ఏడాది కాలంగా ఆమె ఉంటున్న అపార్ట్మెంట్ ను  సందర్శించేవాడని  గల్ఫ్ జాతీయ కోర్టు రికార్డులు గుర్తించాయి. అజ్మన్  పబ్లిక్ ప్రాసిక్యూషన్ కధనం ప్రకారం  బాధితురాలిని దారుణంగా గొంతు నులిమి చంపినా తర్వాత ఇక ఆమె  శ్వాస లేదని నిర్ధారించుకున్న తర్వాత హంతకుడు వెలుపలికి వెళ్లి పూటుగా  త్రాగి వచ్చి మంచానికి చేరుకొని ఏమీ జరగనట్లు నిర్భీతిగా నిద్రపోతున్నట్లు  వివరించింది. హత్య చేసిన రెండు గంటల తర్వాత నిందితుడికి మెలుకువ రావడంతో  సమీప పోలీస్ స్టేషన్ కు వెళ్ళి తానే తన స్నేహితురాలిని  హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com