అమెరికా వీసాలకు ‘ట్రంప్’ బ్రేక్
- March 23, 2026
అమెరికా: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠిన వలస విధానాల ప్రభావం భారత్, చైనా దేశాలపై తీవ్రంగా పడుతోంది. ‘వాషింగ్టన్ పోస్ట్’ కథనం ప్రకారం, 2025లో వీసా జారీ ప్రక్రియలో గణనీయమైన తగ్గుదల నమోదైంది.”అమెరికా పౌరులకే తొలి ప్రాధాన్యం” అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన ట్రంప్ ప్రభుత్వం, విదేశీయులకు వీసాల జారీ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. దీనివల్ల ముఖ్యంగా భారత్, చైనా నుంచి అమెరికా వెళ్లాలనుకునే వారికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
2024 జనవరి-ఆగస్టు కాలంతో పోలిస్తే, 2025 అదే సమయంలో 11 శాతం తక్కువగా శాశ్వత, తాత్కాలిక వీసాలను ట్రంప్ ప్రభుత్వం ఆమోదించింది.దాదాపు 2.5 లక్షల వీసాలు తక్కువగా జారీ అయ్యాయి. ఇందులో పర్యాటక వీసాలు కాకుండా విద్యార్థి, ఉపాధి (H-1B వంటివి), కుటుంబ సభ్యుల వీసాలు ఉన్నాయి.ఆ వీసాలను విద్యార్థులు, ఉపాధి కోసం వచ్చేవారు, చట్టబద్ధ నివాసితుల కుటుంబసభ్యులకు జారీ చేస్తుంటారు. టూరిస్ట్ వీసాల జారీలో కూడా గతంతో పోలిస్తే భారీగా కోత విధించినట్లు నివేదిక స్పష్టం చేసింది.
తగ్గిన ఆ 11 శాతం వీసాల్లో పర్యటక వీసాలు భాగం కాదు. ఈ ఎనిమిది నెలల కాలంలో వాటి జారీ కూడా తగ్గిపోయింది. “అమెరికా పౌరులకే తొలి ప్రాధాన్యం అనే హామీతో ట్రంప్ ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. ఆయన తీసుకునే ప్రతీ నిర్ణయం దానిని ప్రతిబింబిస్తోంది” అని వైట్ హౌస్ అధికార ప్రతినిధి అబిగెయిల్ జాక్సన్ వెల్లడించారు. “సొంత ప్రజల భద్రత విషయంలో ట్రంప్ రాజీలేని వైఖరి ప్రదర్శిస్తున్నారు. అందుకే పరిశీలన(వెట్టింగ్) ఎదుర్కోని విదేశీయులను భారీ సంఖ్యలో అమెరికాలోకి అనుమతించేందుకు అధ్యక్షుడు సుముఖంగా లేరు” అని విదేశాంగ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- మూడు జోన్లుగా భాగ్యనగరం..సీఎం రేవంత్
- భూ మార్గాల ద్వారా కార్గో మళ్లింపు..కువైట్ కస్టమ్..!!
- ఖతార్ నేషనల్ లైబ్రరీ రీ ఓపెన్..టైమింగ్స్ ఇవే..!!
- రష్యన్ ఉప విదేశాంగ మంత్రితో బహ్రెయిన్ రాయబారి భేటీ..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు ఎంత మేర పెరగవచ్చు?
- ఒమన్ లో భారీ వర్షాలు..భద్రతా హెచ్చరికలు జారీ..!!
- సౌదీ అరేబియాకు ఫ్రాన్స్ మద్దతుగా ఉంటుంది: మాక్రాన్
- JEE మెయిన్ సెషన్-2 పరీక్షల షెడ్యూల్ విడుదల
- సమ్మర్ షెడ్యూల్ రిలీజ్ చేసిన DGCA..
- అమెరికా వీసాలకు ‘ట్రంప్’ బ్రేక్









