శోభాయాత్ర ప్రశాంతంగా సాగేలా ఏర్పాటు చేస్తున్నాం: సీపీ సజ్జనార్
- March 23, 2026
హైదరాబాద్: శ్రీరామ నవమిని పురస్కరించుకుని ప్రతిఏటా హైదరాబాద్లో వైభవంగా శ్రీరాముని శోభాయాత్రను నిర్వహిస్తారు. ఈ సారి కూడా శోభయాత్రను నిర్వహించేందుకు సన్నాహలు ప్రారంభించారు. హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఉత్సవ కమిటీ నిర్వహకులతో సమావేశం అయ్యారు. నగరంలో శ్రీరాముని శోభయాత్రలో నిర్వాహకులు కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలని చెప్పారు.
సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. 'శ్రీరామ నవమి ఉత్సవ కమిటితో సమన్వయ సమావేశం నిర్వహించాం. 16 ఏళ్లుగా శోభయాత్ర సమర్థవంతగా, విజయవంతంగా జరుగుతుంది. ఈ సారి కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తాం. అందరి సహకారంతో ఈ యాత్రను ప్రశాంతంగా సాగేల ఏర్పాట్లు చేస్తున్నాం.శోభాయాత్ర కమిటీ కొన్ని విషయాలను మా ముందు ఉంచారు.. వాటిని పరిశీలిస్తాం' అని ఆయన వెల్లడించారు.
'అలానే ప్రభుత్వ, పోలీస్ శాఖ తరఫు నుంచి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తాం. శోభాయాత్రకు సుమారుగా 3000 మంది పోలీసులు భద్రత విధుల్లో ఉంటారు. చైన్ స్నాచింగ్, ఇతర ఘటనలు జరగకుండా క్రైమ్ టీమ్స్ ను, షీ టీంలను మోహరిస్తాం. శోభాయాత్ర జరిగే తీరును డ్రోన్లతో పర్యవేక్షిస్తాము.ఈ యాత్ర సాగే మార్గాలు సీసీ టీవీలను ఏర్పాటు చేసి వాటి ద్వారా నిరంతర నిఘాని కొనసాగిస్తాం.గతేడాది వెహికల్ బ్రేక్డౌన్ కారణంగా శోభాయాత్ర నెమ్మదించింది. ఈసారి అలాంటి సమస్యలు లేకుండా శోభాయాత్రను అనుకున్న సమయానికి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం' అని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







