క్యాండిడేట్స్ టోర్నీ నుంచి తప్పుకున్న కోనేరు హంపి
- March 24, 2026
పశ్చిమాసియాలో మండుతున్న యుద్ధ మేఘాల వల్ల భారత స్టార్ చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఫిడే (FIDE) మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ నుంచి తప్పుకున్నారు. అక్కడ బాంబుల మోతల మధ్య, ప్రాణభయం ఉన్న చోట ప్రశాంతంగా చెస్‌పై దృష్టి పెట్టడం సాధ్యం కాదని ఆమె అభిప్రాయపడ్డారు. వ్యక్తిగత భద్రత దృష్ట్యా ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
“ఈ నిర్ణయం తీసుకోవడం నాకు చాలా బాధను కలిగించింది. కానీ ప్రాణాల కంటే, వ్యక్తిగత భద్రత కంటే మరేదీ ముఖ్యం కాదు. అశాంతి నెలకొన్న ప్రాంతంలో ఆటకు ఏకాగ్రత కుదరదు” అని హంపి పేర్కొన్నారు. అయితే, టోర్నీ ప్రారంభానికి కొద్దిరోజుల ముందు ఇలా అకస్మాత్తుగా బాయ్‌కాట్ చేయడంపై అంతర్జాతీయ చెస్ సమాఖ్య (FIDE) తీవ్రంగా స్పందించింది.
టోర్నీ నుంచి అర్ధాంతరంగా వైదొలిగినందుకు నిబంధనల ప్రకారం కోనేరు హంపిపై ఫిడే 10 వేల యూరోల జరిమానా విధించింది.హంపి స్థానంలో ఉక్రెయిన్ క్రీడాకారిణి అన్నా ముజిచుక్‌ను టోర్నీకి ఎంపిక చేస్తున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. హంపి నిర్ణయం భారత క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజా వార్తలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!







