వ్యాట్ ఎగవేత..వ్యాపారవేత్తకు 5 ఏళ్ల జైలుశిక్ష..!!
- March 24, 2026
మనామాః బహ్రెయిన్‌లోని ఉన్నత క్రిమినల్ కోర్టు..వ్యాట్ ఎగవేతకు పాల్పడిన ఒక వ్యాపారవేత్తకు ఐదు సంవత్సరాల జైలుశిక్ష మరియు BHD 247,559.551 జరిమానా విధించింది. ఇక ఇప్పటివరకు చెల్లించని వ్యాట్ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని మరియు శిక్షాకాలం పూర్తయ్యాక అతడిని దేశం నుండి బహిష్కరించాలని కోర్టు ఆదేశించింది.
ఆహార రిటైల్ షాపుల యజమాని ఒకరు నేషనల్ బ్యూరో ఫర్ రెవెన్యూ (NBR)కి తప్పుడు పత్రాలు సమర్పించాడు. దిగుమతి రికార్డులను నిర్వహించడంలో విఫలమయ్యాడు. ఇలాంటి పద్ధతుల ద్వారా వ్యాట్ ఎగవేసినట్లు దోషిగా తేలాడు. పైగా నోటీసు జారీ చేసినప్పటికీ నిందితుడు కోర్టుకు హాజరు కాలేదు.
విచారణలో, నిందితుడు వ్యాట్ ను తప్పించుకునేందుకు, చెల్లించాల్సిన మొత్తాలను ఉద్దేశపూర్వకంగా తక్కువగా చూపి, తప్పుడు వ్యాట్ రిటర్న్‌లను సమర్పించినట్లు వెల్లడైంది. పన్ను ఎగవేత ఆరోపణలతో “తవాసుల్” యాప్ ద్వారా అందిన ఒక ఫిర్యాదుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అధికారులు కంపెనీ శాఖలలో తనిఖీలు నిర్వహించారు.
వ్యాపారవేత్త తప్పుడు పత్రాలను సమర్పించాడని, వ్యాట్ మినహాయింపులను సక్రమంగా క్లెయిమ్ చేయలేదని, ఇన్వాయిస్లను జారీ చేయడంలో విఫలమయ్యాడని, దిగుమతులు, సేవలకు సంబంధించిన క్రమబద్ధమైన అకౌంటింగ్ రికార్డులను నిర్వహించలేదని అదికారులు సాక్ష్యాధారాలు సేకరించి కోర్టుకు సమర్పించారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







